వైసీపీలో గంటా చేరిక నిజమేనా??

By Krishna Babu Oct. 01, 2020, 06:44 pm IST
వైసీపీలో గంటా చేరిక నిజమేనా??

మాజీ మంత్రి, టీడీపీ తరుపున గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరికకు సంబంధించిన ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. గంటా పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై అటు ఆయన గానీ, ఇటు వైఎస్సార్సీపీ నేతలు గానీ అధికారికంగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో గంటా చేరికకు సంబంధించిన సన్నాహాల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. విశాఖ రాజధానికి సంబంధించిన వ్వవహారం కీలకదశకు చేరుకున్న నేపధ్యంలో ఇప్పటికే విశాఖ తెలుగుదేశం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ వైసీపికి మద్దతు పలికిన విషయం తెలిసిందే.

ఇప్పటికే అనేక మార్లు గంటా శ్రీనివాస్ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు వెలువడినా అవన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి. అయితే తాజాగా గంటా శ్రీనివాస్ కుమారుడు రవితేజతో కలిసి ఎల్లుండు సీయం జగన్ ను కలవనున్నారని. ఈ విషయమై విశాఖ నార్త్ నియోజకవర్గ వైసీపి ఇంచార్జ్ కేకే రాజుకు అమరావతి నుండి పిలుపు కూడా వచ్చిందనే వార్త మరోసారి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ వార్తలో నిజం లేదనే మాట వినిపిస్తున్నా, రానున్న రోజుల్లో గంటా చేరిక వార్తలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp