లాక్ డౌన్.. రాజధాని ఉద్యమం ఆగుతుందా..?

By iDream Post Mar. 25, 2020, 12:29 pm IST
లాక్ డౌన్.. రాజధాని ఉద్యమం ఆగుతుందా..?

ఆరోగ్యం, ప్రాణాల కన్నారాజకీయాలు ముఖ్యం కాదని నాయకులు భావిస్తున్నారు. ప్రపంచాన్నివణికిస్తున్నా కారోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉద్యమాలు, Caa, ఎన్సీఆర్, npr లకు వ్యతిరేకంగా మైనార్టీలు చేపట్టిన ఉద్యమాలు మూతపడ్డాయి. వైరస్ ను నిరోధించే చర్యల్లో భాగంగా ఎక్కవ మంది ఒకే చోట గుమిగూడి ఉండకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టం చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలతో పాటు, ఉద్యమాలు కూడా మూతపడ్డాయి. అయితే రాజధాని ప్రాంత రైతులు ఉద్యమాలు కొంత మేర కొనసాగుతున్నా గతంలో ఉన్నంత ప్రభావం కనిపించడం లేదు.

వైఎస్ జగన్ ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడం కూడా ప్రారంభించింది. దీంతో రాజధాని అమరావతి పరిధిలో ని తుళ్లూరు, మంగళగిరి, మందడం, ఉద్దండరాయపాలెం తదితర ప్రాంతాల్లో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రొద్బలంతో ఈ ఉద్యమాలు చేస్తున్నారని వైసిపి నేతలు కొందరు ఆరోపిస్తున్నారు. రాజధాని ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు ఆపార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నించగా టీడీపీ అనుకూల మీడియా మినహా మిగిలిన పత్రికలు, మీడియా సంస్థలు రాజధాని ఉద్యమాని కి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజధాని ఉద్యమాన్ని టీడీపీ నాయకులు, ,సామాజిక వర్గం పెద్దలు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేం దుకు ప్రయత్నించారు.

సుమారు 90 రోజులకు పైగా సాగిన ఉద్యమం కరోనా మహమ్మారి ప్రవేశించడంతో నీరు గారిపోయింది. అయినా రాజధాని అంతో ఇంతో మాస్కులు ధరించి, దూరంగా కూర్చొని మరీ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వైరస్ ను లెక్క చేయకుండా ఉద్యమాన్నికొనసాగించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రజలు ఒకే చోట గుమిగూడివద్దన్న.ప్రభుత్వం హెచ్చరికలు స్థానికులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాజధాని ఉద్యమం ఆగుతుందా..? లేదా..? మరికొద్ది రోజుల్లో తేలనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp