క్లోనింగ్ రైళ్లు.. !

By Voleti Divakar Sep. 18, 2020, 07:20 am IST
క్లోనింగ్ రైళ్లు.. !

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కుందేళ్లు, ఎలుకలు, ఆఖరికి మనుషులను కూడా క్లోనింగ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ క్లోనింగ్ రైళ్లు ప్రవేశపెడుతోంది. దేశవ్యాప్తంగా సుమారు 20 జతల క్లోనింగ్ రైళ్లను నడవనున్నట్లు ఆధికారులు ప్రకటించారు. ఆయితే ఇందుకు సాంకేతిక పరిజ్ఞానం ఏమీ ఆవసరం లేదు. ఖాళీ ర్యాన్లు(రైలుబోగీలు) అందుబాటులో ఉండే సరిపోతుంది. ఈ రైళ్లన్నీ ఒకే నెంబర్లో నడవడం విశేషం.

అన్ లాక్ లో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రాజధాని లాంటి రైళ్లకు గిరాకీ లేక రద్దు చేశారు. కొన్ని మార్గాల్లో తిరిగే రైళ్లకు మాత్రం ప్రయాణీకుల నుంచి తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోంది. ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు క్లోనింగ్ రైళ్లను నడపాలని నిర్ణయించారు.

బెంగుళూరుకు సమీపంలోని క్రాంతివీర సంగొల్లి రాయన స్టేషన్ - దానపూర్-క్రాంతి వీర సంగొల్లి రాయన మధ్య నడిచే ప్రత్యేక రైలుకు ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో క్లోనింగ్ రైలును నడపాలని నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ రైళ్లు ప్రతీ సోమవారం నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల ఆధికారి సిహెచ్ రాకేష్ వెల్లడించారు. ఈరైళ్లలో ఆన్నీ ఎసి త్రీటైర్, స్లీపర్ కోన్లు ఉంటాయని, చార్జీలు మాత్రం హమ్ నగర్ ఎక్స్ ప్రెస్ తరహాలో ఉంటాయని ఆయన తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp