నేను టీడీపీని వీడ‌డం లేదు

By Raju VS Dec. 09, 2019, 11:42 am IST
నేను టీడీపీని వీడ‌డం లేదు

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయ‌న మీడియా ప్ర‌తినిధుల‌తో ముచ్చ‌టించారు. ఈసంద‌ర్భంగా తాను టీడీపీని వీడుతున్న‌ట్టు సాగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు. తాను పార్టీలో కొన‌సాగుతాన‌ని తెలిపారు.

ఇటీవ‌ల త‌న‌ క్వారీల్లో మూడుసార్లు అధికారులు తనిఖీలు నిర్వహించిన‌ట్టు అద్దంకి ఎమ్మెల్యే తెలిపారు. గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు. త‌న‌ఖీల‌పై అధికారులు క‌నీస స‌మాచారం కూడా ఇవ్వ‌డం లేద‌న్నారు. క్వారీల‌లో త‌మ సిబ్బందిని కూడా అనుమ‌తించ‌డం లేద‌ని వాపోయారు.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీతో త‌రుపున గెలిచి టీడీపీలో చేరిన గొట్టిపాటి ర‌వికుమార్, మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున గెలిచారు. అయితే మ‌ళ్లీ పార్టీని వీడి వైసీపీలో చేరుతున్న‌ట్టు పెద్ద స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానంతో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ ఈ ప్ర‌చారానికి ఊపందుకుంటోంది. ఈ ప‌రిణామాల‌తో తాజాగా ఎమ్మెల్యే కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశాల‌య్యాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp