భాగ్యనగరం కోసం టాలీవుడ్ సెలెబ్రెటీల విరాళం

By Kiran.G Oct. 20, 2020, 04:09 pm IST
భాగ్యనగరం కోసం టాలీవుడ్ సెలెబ్రెటీల విరాళం

గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా భాగ్యనగరం అతలాకుతలం అయింది. మూసి నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లు విపరీతంగా దెబ్బతిన్నాయి. వీధులన్నీ నీటితో నిండిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.వరద బాధితులకు తక్షణ సహాయ చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.550 కోట్లు విడుదల చేసింది. తాజాగా భాగ్యనగర వరద బాధితుల కోసం టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు.

హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు తమవంతు ఆర్ధిక సాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. ముందుగా నాగార్జున 50 లక్షలు విరాళం పంపగా అదే బాటలో చిరంజీవి సహా మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు తమ విరాళాలను ప్రకటించారు. చిరంజీవి కోటి, మహేష్ బాబు కోటి, జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, త్రివిక్రమ్10 లక్షలు, హరీష్ శంకర్ 5 లక్షల విరాళం ప్రకటించారు. అధిక వర్షాలు కారణంగా అతలాకుతలం అవుతున్న తెలంగాణకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు సాయం చేయడానికి ముందుకొచ్చాయి. తాజాగా సినీ ప్రముఖులు కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp