మెడలో గుమ్మడికాయ కట్టుకోవాలంట..!

By Jaswanth.T Apr. 25, 2020, 11:12 am IST
మెడలో గుమ్మడికాయ కట్టుకోవాలంట..!

మనిషి బ్రతుకు పై సందేహాలు, ఒత్తిడిలు ఉన్నప్పుడు అనేక అనేక నమ్మకాలు పుట్టుకొస్తాయి. వాటిలో మూఢ నమ్మకాలు కూడా ఉంటాయి. అవి సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తులు వరకు ఉంటాయనడంలో సందేహం లేదు. సాధారణంగా ఏదైనా పెద్ద ఉపద్రవం సంభవించినప్పుడు ఈ నమ్మకాలు విస్తృత ప్రచారం పొందుతున్నాయి. ఇప్పుడు కరోనా మహమ్మారి సమయంలో పలు మూఢ నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో అమావాస్యకు మంగళసూత్రానికి కావాలి అనేది కూడా ఒకటి. అది కూడా ఒక దేవస్థానము పీఠాధిపతి చెప్పారంటూ మూఢ నమ్మకానికి 'నమ్మకం కలర్' కల్పించేందుకు ప్రయత్నం జరుగుతోంది. సదరు పీఠాధిపతి అనుచరులు ఈ విషయం ఖండించినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుండడం ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది.

ఒక్కడే కొడుకు ఉన్నవాళ్లు ఆంజనేయస్వామికి కొబ్బరికాయ కొట్టాలని, కొబ్బరి మొక్కకు పసుపు నీళ్ళు వేసి బొట్టు పెట్టాలని, అలాగే ఆడపడుచులకు బట్టలు పెట్టక పోతే అరిష్టమని, కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టాలని.. రకరకాల పుకార్లు పుట్టుకురావడం తెలిసిన విషయమే. వీటన్నిటికీ మూలం మనుషుల మానసిక స్థితి అన్నది సుస్పష్టం. ప్రకృతి విపత్తులు, వ్యాధులు విజృంభిస్తున్న సమయంలో ఇటువంటి మూఢనమ్మకాలు విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఇటువంటివి ఎక్కువగా ఉంటాయని అనుకోడానికి లేదు. పట్టణ ప్రాంతాల్లోని వారు సైతం వీటిని ఆచరించడం గమనించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మంగళసూత్రం ఉంటుందని కనుక కట్టుకుంటారు మరి అవి లేని చోట్ల ఎక్కడ కట్టుకోవాలనే విమర్శలు కూడా వస్తుంటాయి. కానీ వీటిని పట్టించుకోకుండా నమ్మిన వాళ్లు ఆచరిస్తుంటారు. ఈ పుకార్లను పరిశీలిస్తే వీటిని ఆచరించేందుకు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు ఎంచుకోవడం గుర్తించవచ్చు.

కొబ్బరికాయలు, బట్టలు పసుపుకొమ్ములు ఇలా అందరికీ అందుబాటులో ఉండే వాటిని పుకార్ల రాయుళ్లు ఎంచుకోవడం చూస్తుంటే సామూహిక అమలు కోసం ప్రచారం చేస్తున్నారని భావించాల్సి వస్తుంది. నిజానికి ఒక తులం బంగారం గుమ్మానికి వేలాడదీయండి.. అంటే ఎంత మంది దీని ఆచరించి గలుగుతారు అన్న ప్రశ్న వేసుకుంటే ఒక్కరు కూడా ఉందరనేది సత్యం. ఇదే విషయాన్ని తాము స్వయంగా ఆచరించి ఇతరులను ఆచరించాలని చేసే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. లేకపోతే తార్కికంగా ఆలోచించే శక్తిని కోల్పోవాల్సి వస్తుంది. అంతే కాకుండా ఇటువంటి మూఢనమ్మకాలు విస్తృతంగా ప్రచారం చేస్తే అది మతం పై, సమూహాలపై నమ్మకం పోతుంది. పైగా వాటి మూల సూత్రాలపై కూడా ఉండే ఉన్నత అభిప్రాయాలు కూడా దిగజారుతాయి. ఎటువంటి లాజిక్ లేకుండా విస్తృతంగా ప్రచారం జరిగే ఇటువంటి మూఢనమ్మకాల ఖండించాల్సిన బాధ్యత పీఠాధిపతులు, సమూహ పెద్దలపై కూడా ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp