పరువు హత్యతో ఉలిక్కిపడ్డ హైదరాబాద్

By Kiran.G Sep. 25, 2020, 11:53 am IST
పరువు హత్యతో ఉలిక్కిపడ్డ హైదరాబాద్

అత్యంత కిరాతకంగా హత్యకు గురైన ప్రణయ్ ఉదంతం మరువక ముందే హైదరాబాద్ నగరంలో మరో పరువు హత్య కలకలం సృష్టించింది. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో యువతి తరపు బంధువులు కిరాయి మనుషులకు సుపారీ ఇచ్చి కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని కిరాతకంగా హత్య చేయించాడు.

వివరాల్లోకి వెళితే చందానగర్‌కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అవంతి ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన అవంతి తల్లిదండ్రులు ఆమెను నిర్బంధించి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అవంతి వారి నుండి తప్పించుకుని వచ్చి హేమంత్ ఇంటికి రావడంతో ఇద్దరూ కలిసి జూన్ 10 న బీహెచ్‌ ‌ఈఎల్‌ సంతోషీమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. కాగా వీరి ప్రేమ వివాహం ఏ మాత్రం ఇష్టం లేని అవంతి తండ్రి తన బంధువులతో కలిసి మూడు కార్లలో హేమంత్‌ ఇంటికి వచ్చి ఇద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లారు.

కారు నుండి తప్పించుకున్న అవంతి హేమంత్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు అనేక చోట్ల గాలించినా హేమంత్ ఆచూకీ లభించలేదు. కాగా హేమంత్ హత్యతో సంబంధం ఉన్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి తండ్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన సమాచారంతో సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో హేమంత్‌ మృతదేహాన్ని కనుగొన్నారు. హేమంత్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కూతురు జీవితంలో విషాదాన్ని మిగిల్చిన లక్ష్మారెడ్డితో పాటు ఆమె బంధువులను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp