ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న హైకోర్ట్ రిజిస్ట్రార్

By Raju VS Aug. 06, 2020, 08:47 am IST
ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న హైకోర్ట్ రిజిస్ట్రార్

ఏపీ ప్రభుత్వంపై ఇటీవల చేసిన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేందుకు రిజిస్ట్రార్ జనరల్ సిద్ధమయ్యారు. ఈమేరకు కేసు విచారణ సందర్భంగా ఇద్దరు జడ్జీల బెంచ్ ముందు రిజిస్ట్రార్ భానుమతి ఈ విషయం వెల్లడించారు. దానికి అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల హైకోర్టులో పరిణామాలపై రాష్ట్రపతి, సుప్రీంకోర్ట్ న్యాయమూర్తికి ఫిర్యాదులు వెళ్లాయి. అదే సమయంలో హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్ మృతి, పలువురు సిబ్బందికి కోవిడ్ సోకడంపై విచారణ జరపాలని పిటీషన్ కూడా దాఖలయ్యింది. ఆ కేసు విచారణ సందర్భంగా భానుమతి రిజిస్ట్రార్ జనరల్ హోదాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పులను ఏపీ ప్రభుత్వం జీర్ణం చేసుకోలేకపోతోందంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య నాయకత్వంలోని సంఘం ప్రతినిధులు కేసులు వేయడం అందులో భాగమేనని వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంలో చివరకు భానుమతి వెనకడుగు వేశారు. ప్రభుత్వంపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేందుకు సిద్ధపడ్డారు. అంతేగాకుండా రిటైర్డ్ జడ్జి, ప్రస్తుతం ఏపీ ఉన్నత రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గా ఉన్న ఈశ్వరయ్యపై చేసిన వ్యాఖ్యలను కూడా ఆమో ఉపసంహరించుకునేందకు సిద్ధమయ్యారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై కోర్టు ధిక్కారణ విషయంలోనూ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నారు.

తొలుత ఈ కేసు విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ తన అభ్యంతరాలు తెలిపారు. ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. సుప్రీంకోర్ట్ ఆదేశాలకు భిన్నంగా ఉందని పేర్కొన్నారు. చివరకు రిజిస్టార్ జనరల్ కూడా వాటిని అంగీకరించడంతో ఈ కేసుల తదుపరి విచారణను వాయిదా వేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp