హెరిటేజ్ నాది కాదు... చంద్రబాబు నాయుడు.

By Bairisetty Nagaraju Dec. 10, 2019, 02:39 pm IST
హెరిటేజ్ నాది కాదు... చంద్రబాబు నాయుడు.
హెరిటేజ్ ఎవరిదని రాష్ట్రం లో ఎవరిని అడిగినా టక్కున చెప్పే సమాధానం చంద్ర బాబు నాయుడు ది అని. అయితే చంద్ర బాబు నాయుడు మాత్రం హెరిటేజ్ తనది కాదని, నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఉల్లి ధరలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఉల్లి కోసం ప్రజలు రైతు బజార్ల వద్ద క్యూ లో నిల్చుని ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. దీంతో స్పందించి న మంత్రి బుగ్గన, మరో మంత్రి కురుసాల కన్న బాబు లు ఉల్లి కోసం ఇంత వరకు రాష్ట్రం లో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు అని అన్నారు. శవాలపై కూడా టీడీపీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. ఉల్లి దరాలపై ఇంతగా మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యే లకు, చంద్రబాబు కు చెందిన హెరిటేజ్ లో కిలో రూ.200 అమ్ముతున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన చంద్రబాబు హెరిటేజ్ కు తనకు సంబంధం లేదని, నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దీంతో స్పందించిన మంత్రి బుగ్గన బిజినెస్ స్టాండెడ్ కాలాన్ని ఉటంకిస్తూ...హెరిటేజ్ సంభందించిన షేర్లు, లాభ నస్టాల పై రికార్డ్ ఏవిడేన్సె తో సమాధానం ఇవ్వడం తో చంద్ర బాబు మౌనం దాల్చారు. అయితే చంద్రబాబు మాత్రం హెరిటేజ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని బలంగా వాదించడాన్ని ప్రసార మాధ్యమాలలో చూసిన ప్రజలు ఇదేమి చోద్యం...హెరిటేజ్ చంద్రబాబు ది అయితే...తనది కాదని చెప్పడం విడ్డూరంగా ఉందని నవ్వుకున్నారు. హెరిటేజ్ భాద్యతలు కోడలు బ్రహ్మణి చుస్తున్నప్పటికి సంస్థ స్థాపించింది మాత్రం చంద్ర బాబు కదా అని అందరూ చర్చించుకుంటున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp