హెరిటేజ్ పాలిటిక్స్ - చిన్నబాబు మనీ!!!

By Amar S Dec. 11, 2019, 08:09 am IST
హెరిటేజ్ పాలిటిక్స్ - చిన్నబాబు మనీ!!!

ఎన్నికల ముందు వరకు లోకేష్ నాకు వ్యాపారాలు లేవు,మా అమ్మగారు,నా శ్రీమతి హెరిటేజ్ ద్వారా పాలు పెరుగ, కూరగాయలు అమ్మి సంపాదించిన డబ్బుతో బతుకుతున్నాను అని చెప్పుకువాడు. ఇప్పుడు ఏమైందో కానీ మాకు హెరిటేజ్ తో సంబంధం లేదు అని చంద్రబాబు కుటుంబం మొత్తం చెప్పుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హెరిటేజ్ చర్చకు వచ్చింది. తాజాగా అసెంబ్లీలో పెరిగిన నిత్యావసరాల ధరలు, ఉల్లిపాయల రేట్లపై మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వం ధరలను తగ్గించేందుకు చర్యలను తీసుకోవాలని కోరారు. దీంతో కొందరు వైసీపీ సభ్యులు హెరిటేజ్‌ ఫ్రెష్‌లో అధిక ధరలకు ఉల్లిపాయలను అమ్ముతున్నారంటూ చంద్రబాబుపై మూకుమ్మడి దాడి చేసారు. దానికి ప్రతిగా చంద్రబాబు కౌంటరిస్తూ హెరిటేజ్ మాది కాదని, ఆ సంస్థను అమ్మేసామని చెప్పుకొచ్చారు.

Also Read : హెరిటేజ్ ఎవరిది ??

దీనిపై మంగళవారం నుంచి చంద్రబాబు ట్రోల్ అవుతున్నారు. ఫ్యూచర్ గ్రూపులో హెరిటేజ్ ను భాగస్వామ్యం చేసి షేర్ల వాల్యూ లెక్కన చంద్రబాబుకు డబ్బులు ఇస్తున్నారు. వీటిని పర్సంటేజీల లెక్కన ఫ్యూచర్ సంస్థ ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. వీటన్నిటినీ వైసీపీ సభ్యులు సభలో ప్రస్తావించారు. ఆర్ధికమంత్రి బుగ్గన ఈ వివరాలన్నీ సభలో ప్రస్తావించారు.బుగ్గన లెక్కల మీద శాసనసభలోని ఉన్న చంద్రబాబు స్పందించలేదు.

అయితే ఈ ఆరోపణలపై చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి స్పందించారు. మంగళవారం ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదన్నారు. "నేను అసెంబ్లీ సమావేశాలను చూడను.. హెరిటేజ్‌ ఫ్రెష్‌ ఇప్పుడు మాకింద లేదు. హెరిటేజ్‌ ఫ్రెష్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో నడుస్తోంద"ని వ్యాఖ్యానించారు.

ఉల్లి ధరల పెరుగుదలపై భువనేశ్వరి మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పుడూ ఇంత అధిక రేట్లను చూడలేదన్నారు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా చొరవ చూపి చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, క్యూలో నిలుచొని ఉల్లి కూడా కొనలేని పరిస్థితుల్లో వెనుదిరుగుతున్నారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తంచేసారు.

ఏ సంస్థలోనైనా వాటాదారులు హక్కుదారులని,వారి వాటా విలువను బట్టి వారి హక్కు ఉంటుందని ప్రజలకు తెలిసిన విషయమే. ఇప్పుడు మైనర్ లకు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడులకు డీమ్యాట్ అకౌంట్ లు ఇస్తున్నారు. ఒక సంస్థను మరో పెద్ద సంస్థకు అమ్మి యాజమాన్య బదలాయింపు చేసి ఆ పెద్ద సంస్థలో వాటా తీసుకోవటానికి తేడా తెలియని వారు లేరు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp