చెన్నైలో భారీ వర్షాలు - జలమయిన వీధులు

By Kiran.G Oct. 29, 2020, 11:52 am IST
చెన్నైలో భారీ వర్షాలు - జలమయిన వీధులు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈశాన్య రుతుపవనాల కారణంగా చెన్నై నగరం తడిసిముద్దైంది.

ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులో ప్రవేశించిన కారణంగా చెన్నై నగరంలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా రోడ్లు,వీధులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రాత్రంతా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తూనే ఉంది.

రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఐదేళ్ల క్రితం 2015లో చెన్నై నగరం ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా అతలాకుతలం అయింది. మళ్ళీ ఆ దుర్ఘటన పునరావృతం అవుతుందేమో అన్న సందేహాలు పలువురిలో మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. కాగా ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp