మోడీ ప్రమేయం లేదు

By Suresh Dec. 12, 2019, 07:38 am IST
మోడీ ప్రమేయం లేదు

గుజరాత్ అల్లర్ల కేసులో మోడీ ప్రమేయం లేదని జస్టిస్ ననావతి కమిషన్ నివేదిక వెల్లడించింది. గోద్రాలో సబర్మతి రైల్ బోగీలు దహనమై అప్పట్లో 59 మంది మరణించిన సంగతి తెలిసిందే.

దీనిపై దర్యాప్తు చేసేందుకు విశ్రాంత న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఒక కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుండి దర్యాప్తు చేసిన కమిషన్ ఈ అల్లర్లలో మోడీ ప్రభుత్వం ప్రమేయం ఏమి లేదని క్లీన్ చీట్ ఇచ్చింది. తుది నివేదికను 2014లో ఇవ్వగా ఇప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ ముందుంచారు. నివేదికలో అల్లర్లు ముందస్తు ప్రణాళికతో జరిగినవి కాదని.. కొన్ని చోట్ల తగినంత పోలీసు బలగాలు లేకపోవడం.. వారి వద్ద సరిపడు ఆయుధాలు లేకపోవడమే ప్రధాన కారణమని కమిషన్ అబిప్రాయం వ్యక్తం చేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp