వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ : టీడీపీకి మింగుడుప‌డ‌ని నిర్ణ‌యం

By Kalyan.S Oct. 29, 2020, 10:30 am IST
వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ : టీడీపీకి మింగుడుప‌డ‌ని నిర్ణ‌యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ప‌నితీరు గురించి ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఇటీవలే.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కరోనా కట్టడికి ఏపీ బాగా కృషిచేసిందని ప్రశంసించారు. అన్ని రాష్ట్రాలు ఇలాంటి వ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేస్తే బాగుంటుంద‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇన్ని ప్రశంసలు లభిస్తుంటే.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం ఇంకా వ‌లంటీర్ వ్యవస్థను విమ‌ర్శిస్తూనే ఉన్నారు. వారికి మింగుడు ప‌డ‌ని ఓ విష‌యం మ‌రో రాష్ట్రం తీసుకుబోతోంది. త‌మ రాష్ట్రంలోనూ వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ప్ర‌వేశ‌పెట్టే విష‌యాన్ని ఆలోచిస్తామ‌ని, ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్తాన‌ని అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ షేక్‌ ఆరిజ్‌అహ్మద్ తెలిపారు.

సేవ‌లు అద్భుతం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు బాగున్నాయని అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ షేక్‌ ఆరిజ్‌అహ్మద్‌ అన్నారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా పొదిలికి వచ్చిన సందర్భంగా మంగళవారం పట్టణంలోని వలంటీర్లు, సచివాలయానికి సంబంధించిన వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీసులతో ముఖాముఖి మాట్లాడారు. పంచాయతీ డీఈ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. వలంటీర్ల విధుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ, విద్య, వైద్య రంగాలకు సంబంధించి ఎటువంటి సేవలు అందిస్తున్నారని ఆరా తీశారు. వలంటీర్ల అర్హతలు, ఎంపిక విధానం ఎలా జరిగింది, సచివాలయం ఉద్యోగులైన వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీసుల విధులు, నిర్వహణ తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులకు వెంటనే లబ్ధి చేకూర్చేలా తాము విధులు నిర్వహిస్తున్నట్లు వలంటీర్లు వివరించారు. ఆరిజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ అసోం రాష్ట్రానికి ఈ వ్యవస్థ పనితీరును గురించి సవివరంగా రిపోర్ట్‌ అందచేయనున్నట్లు తెలిపారు. స్వ‌ప‌క్ష‌మైనా, విప‌క్ష‌మైనా ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంటే ప్రోత్స‌హించ‌క‌పోయినా నిరుత్సాహ‌ప‌ర‌చ‌కూడ‌దు. అసోం రాష్ట్రం వెల్ల‌డించిన నిర్ణ‌యంతోనైనా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ వ‌ల్ల క‌లుగుతున్న లాభాల‌ను టీడీపీ గుర్తిస్తే మేలు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp