రాజధానిని మార్చటంలేదు - శాసన మండలిలో ఏ.పి సర్కార్

By Krishna Babu Dec. 13, 2019, 05:31 pm IST
రాజధానిని మార్చటంలేదు - శాసన మండలిలో ఏ.పి సర్కార్

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి రాజధాని మార్పుపై అనేక ఊహాగానాలు చెక్కర్లు కొడుతు వచ్చాయి. ప్రతిపక్షమయిన తెలుగుదేశం, రాజధానిని మార్చటానికి జగన్ చూస్తున్నారని అందుకే దానిపై నిపుణుల కమిటి వేశారని అనేక ఆరోపణలు చేసింది. ఆ కమిటి కూడా నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరిగాయని రిపోర్టు ఇచ్చింది. దీంతో రాజధాని మార్పుపై ఆ ప్రాంత రైతులు,సామన్యులలో కూడా అనేక అనుమానాలతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితికి తెరదించుతూ ఎట్టకేలకు రాజధాని మార్పుపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అమరావతిని మారుస్తున్నారా అని శాశన మండలిలో తెలుగుదేశం సభ్యుని ప్రశ్నకు రాజధానిని మార్చటంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాజధాని మార్పు ఉండకపోవచ్చుకానీ అభివృద్ది వికేంద్రీకరణపై జగన్ సర్కార్ దృష్టి పట్టినట్టు తెలుస్తోందని. దేశంలో 12 రాష్ట్రాలలో రాజధాని ఒక చోట హైకోర్టు ఒక చోట ఉనట్టు ఆంద్రప్రదేశ్లో కూడా పరిపాలనకు అనుకూలమైన భవనాలు మాత్రమే రాజధాని ప్రాంతంలో ఉంచి మిగతావి అన్ని ప్రాంతాలకు సమానంగా వికేంద్రీకరిస్తే ఆంధ్రప్రదేశ్ 9 నగరాలతో కూడిన ఒక విశ్వనగరంగా రూపాంతరం చెందే అవకాశాలు ఉంటాయని కొంతమంది అభిప్రాయపడ్డారు. రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీస్కోలేదని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే, అయితే ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం కూడా తమ అభిప్రాయాన్ని శాసన మండలి వేదికగా ప్రకటించడంతో రాజధాని మార్పుపై ఉన్న గందరగోళానికి తెరపడినట్టు అయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp