గొల్లపూడి - సాయంకాలం అయ్యింది

By Kiran.G Dec. 12, 2019, 01:59 pm IST
గొల్లపూడి  - సాయంకాలం అయ్యింది

విలక్షణ నటుడు,నాటక కర్త ,రచయిత గొల్లపూడి మారుతి రావు కొద్దీ సేపటి కితం మరణించారు. 80 సంవత్సరాల మారుతి రావు వృద్దాప్యపు సమస్యలతో కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నారు.

అనేక సంవత్సరాలు నాటక,సినిమా రచయితగా తెరవెనుక ఉండిపోయిన మారుతి రావు చిరంజీవి - కోడి రామకృష్ణల "ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య" సినిమాతో "థట్ ఈజ్ సుబ్బారావ్" క్యారెక్టర్తో నటుడిగా రంగప్రవేశం చేశారు.సంసారం ఒక చదరంగం,ఆలయ శిఖరం,అభిలాష, స్వాతిముత్యం, ప్రేమ,మురారి లాంటి సుమారు 250 సినిమాలలో నటించిన మారుతి రావ్ చివరి సినిమా జోడి.

గొల్లపూడి నాటకాలు,సినిమాలు కాకుండా సాహిత్య రచనలు ,పత్రికలకు కాలమ్స్ రాశారు. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా సంభాషణల, రచయితగా, 6 సార్లు నంది అవార్డు అందుకున్నారు. మారుతి రావ్ రచనల్లో సాయంకాలం అయ్యింది, అమ్మ కడుపు చల్లగా (ఆత్మకథ) ముఖ్యమైనవి. "జీవన కాలం" పేరుతొ అనేక సంవత్సరాలు పత్రికల్లో ఆర్టికల్స్ రాశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp