పోల‘వర’మే.. డెల్టాకు ఎడారి అంటూ తప్పుడు ప్రచారం

By Prasad Sep. 11, 2021, 11:10 am IST
పోల‘వర’మే.. డెల్టాకు ఎడారి అంటూ తప్పుడు ప్రచారం

బహుళార్థక సాగర్‌ ప్రాజెక్టు పోలవరం. రాష్ట్రానికి జీవనాడి. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పంచడం ద్వారా విభజన వల్ల నష్టపోతున్న నవ్యాంధ్రకు మేలు చేసినట్టు అవుతుందని నాటి యూపీఏ ప్రభుత్వం భావించిందంటే ఈ ప్రాజెక్టు వల్ల కలిగే మేలు గుర్తించవచ్చు. అంతటి విలువైన ఈ ప్రాజెక్టు నిర్మాణ తలంపు చేసిన నాటి నుంచి వివాదాలు.. అసంబర్ధ ఆరోణలు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉన్నా దీని వల్ల గోదావరి డెల్టాకు నష్టమనే ప్రచారం కూడా తొలి నుంచి ఉంది.

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు పునాది రాయ వేసిన నాడు మొదలైంది. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే వైఎస్సార్‌కు వచ్చే ప్రతిష్టకు భంగం కలిగేలా టీడీపీకి చెందిన గోదావరి జిల్లాల నాయకులు ఈ ప్రచారాన్ని ఆరంభించారు. నాటి నుంచి ఇది ఏదో ఒక సందర్భంలో పోలవరం వల్ల డెల్టా ఎడారి అయిపోతుందనే ప్రచారం జరుగుతూనే ఉంది. టీడీపీ సోషల్‌ మీడియాలో ఈ ప్రచారం సాగుతూనే ఉంది. ఇంతకీ ఇది నిజమేనా? పోలవరం పూర్తయితే డెల్టాలో రెండవ పంటకు ఇబ్బందేనా? అంటే కాదని సాగునీటి పారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. సరి కదా! గోదావరి డెల్టాకు పోల‘వరం’ అంటున్నారు.

గోదావరి డెల్టా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చింది. అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ 8.96 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. ఏటా ఖరీఫ్‌, రబీ కలిపి సుమారు 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తుందని అంచనా. ఇది కాకుండా ఉద్యాన పంటలు, ఆక్వా పెద్ద ఎత్తున సాగు జరుగుతుంది. అటు వంటి డెల్టాలో గడిచిన 12 ఏళ్లలో పలు సందర్భాలలో రెండవ పంటకు నీటి ఎద్దడి ఎర్పడుతుంది. దీనిని అధిగమించడానికి పోలవరం అక్కరకు రానున్నదని నిపుణులు చెబుతున్నారు.

Also Read : మాజీ సీఎం మరదలు - ఫుట్ పాత్ పై దయనీయ స్థితిలో  

గోదావరి డెల్టాలో రెండవ పంటకు కనీసం 90 టీఎంసీల వరకు నీరు అవసరం. రబీ కాలంలో సహజ జలాలు (సెల్ఫ్‌ ఈల్డ్‌) 30 టీఎంసీలు కూడా రాకపోవడం వల్ల పూర్తిగా సీలేరు ప్రాజెక్టు మీదనే ఆధారపడాల్సి వస్తుంది. సీలేరు వపర్‌ జనరేషన్‌ నుంచి వచ్చే 40 టీఎంసీలు, బైపాస్‌ విధానంలో మరో పది టీఎంసీలు సాగునీరు సేకరిస్తున్నారు. గోదావరిలో సెల్ఫ్‌ ఈల్డ్‌ 25 టీఎంసీలు కూడా రాని సమయంలో బైపాస్‌ పద్ధతిలో 55 నుంచి 60 టీఎంసీల వరకు నీరు సేకరించాల్సి వస్తుంది. డిసెంబరు నుంచి నీటి రాక పడిపోతున్నందున, సీలేరు నుంచి వచ్చే నీరే పూర్తి అవసరాల తీర్మాల్చి వస్తుంది. పోలవరం నిర్మాణమైతే కృష్ణా డెల్టాకు, విశాఖకు నీరు ఇవ్వాల్సి వస్తే డెల్టాకు రెండవ పంటకు నీరు రాదనే ప్రచారం ఉంది. సాగునీటి కన్నా.. ముందు తాగునీటికి ఆధిక ప్రాధాన్య ఇవ్వాల్సి ఉందని, దీని వల్ల డెల్టాలో సాగునీటి కన్నా కృష్ణా, విశాఖల తాగునీటి అవసరాలకు ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందనే ప్రచారం సాగుతుంది.

జూలైలో మొదలయ్యే వరద ఆగస్టులో ఎక్కువగా ఉంటుంది. ఈ వరద అక్టోబరు నెల వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఈ సమయంలో కూడా ఎగువ నుంచి రోజుకు 40 వేలకు పైగా క్యూసెక్కుల నీరు వస్తుంది. అక్కడ నుంచి నీటి రాక గణనీయంగా పడిపోతుంది. పోలవరం ప్రాజెక్టు 190.6 టీఎంసీలు. డెడ్‌ స్టోరేజ్‌ 119.4 టీఎంసీలు. లైవ్‌ స్టోరేజ్‌ 75.2 టీఎంసీలు. డిసెంబరు నుంచి పూర్తిగా లైవ్‌ స్టోరేజ్‌ మీద ఆధారపడాల్సి వస్తుంది. డిసెంబరు నుంచి ఏప్రిల్‌ నెలాఖరు వరకు గోదావరిలో కనీసం 30 టీఎంసీల వరకు సహజ జలాలు, మరో 50 టీఎంసీల వరకు సీలేరు పవర్‌ జనరేషన్‌ నుంచి నీరు వస్తుంది. అంటే మొత్తం 155.2 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్టు అంచనా. కుడి, ఎడమ కాలువలకు రోజుకు 35 వేల క్యూసెక్కుల నీరు ఇవ్వాల్సి ఉంది. పవర్‌ జనరేషన్‌ ద్వారా డెల్టాకు నీరు విడుదల అవుతుంది.

Also Read : ఫిరాయింపుల్లో ఒక్కో పార్టీది ఒక్కో పద్దతి 

పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే 960 మెగావాట్ల ఉత్పత్తికి 12 టర్బైన్లు నిర్మించనున్నారు. ఒక్కొక్క టర్బైన్‌ ద్వారా 80 మెగావాట్ల చొప్పున విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఒక టర్భైన్‌ పనిచేస్తే 15 వేల క్యూసెక్కుల నీరు నదిలోకి వదులుతారు. అంటే రోజుకు 1.80 లక్షల నీటిని విడుదల చేయాల్సి ఉంది. నీటి రాక తగ్గినప్పుడు విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించుకుంటూ వస్తారు. అంటే జూలై నెల నుంచి అక్టోబరు వరకు పూర్తిస్థాయి విద్యుత్‌ ఉత్పత్తికి ఢోకా ఉండదు. విద్యుత్‌ ఉత్పత్తికి వదిలే నీరే కాకుండా పోలవరం రైట్‌ మెయిన్‌ కెనాల్‌, లెఫ్ట్‌ మెయిన్‌ కెనాలకు కలిపి 35 వేల క్యూసెక్కులు ఇవ్వాల్సి ఉంది. నవంబరు నుంచి ఈ కెనాల్‌కు నీరు ఇవ్వడంతోపాటు, విద్యుత్‌ ఉత్పత్తి చేయాలంటే కష్టమే. అప్పటి నుంచి విద్యుత్‌ ఉత్పత్తి నెమ్మదిగా తగ్గిస్తారు. నీటి లభ్యత కష్టమైనప్పుడు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిపివేస్తారు.

డిసెంబరు నుంచి రోజుకు కనీసం పది వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేస్తే సరిపోతుంది. డిమాండ్‌ లేని సమయంలో 8 వేల క్యూసెక్కులు చాలు. ఈ సమయంలో ఒక్క టర్బైన్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా జరిగినా డెల్టాకు ఢోకా ఉండదు’ అని రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు విప్పర్తి వేణుగోపాల్‌ చెబుతున్నారు. అంతే కాదు. ఒకవేల పోలవరంలో నీటి నిల్వలు అడుగంటి పోయినా డెడ్‌ స్టోరేజ్‌ నుంచి డెల్టాకు నీరు తెచ్చుకునే అవకాశముంది. పోలవరం స్పిల్‌వే 48 పిల్లర్లతో నిర్మాణం చేస్తున్నారు. దీనిలో పది పిల్లర్లకు అండర్‌ స్కవర్‌ స్లూయిజ్‌లతో నిర్మాణం చేశారు. దీని ద్వారా డెడ్‌ స్టోరేజ్‌లో ఉన్న నీటిని రోజుకు పది వేల క్యూసెక్కులకు నీటిని దిగువునకు వదిలేలా నిర్మాణం చేశారు. ఆ పరిస్థితి వచ్చినప్పటికీ పోలవరం ప్రాజెక్టులో 119.4 టీఎంసీలు నిల్వ ఉంటుంది. ఇలా చూసుకున్నా డెల్టాలో రెండవ పంటకు ఢోకా ఉండదని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసని, కాని రాజకీయ కారణాలతో విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు.

Also Read : వచ్చేసారి మండపేటలో వేగుళ్లకు చంద్రబాబు సీటిస్తారా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp