సమైక్య భారతం.. దేదీప్యమానం

By iDream Post Apr. 05, 2020, 10:05 pm IST
సమైక్య భారతం.. దేదీప్యమానం

భిన్న మతాలు, భాషలు, యాసలు, కులాలు, ప్రాంతాలు, ఆచార వ్యవహారాలున్నా.. కష్ట సమయంలో దేశం మొత్తం ఏకం అవుతుందని మరోసారి రుజువైంది. స్వాతంత్ర భారతంలో ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. కంటికికనపడని శత్రువుతో దేశం పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో ప్రతి భారతీయుడు చేయి చేయి కలిపాడు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్‌ లైట్లు ఆర్పేసి,, దీపాలు, కొవ్వొత్తులు, సెల్‌ఫోన్‌లో లైట్లు వెలిగించి తమ ఐక్యతను చాటుకున్నారు. గో కరోనా గో అంటూ నినాదాలు చేశారు.

చెడుపై మంచి తప్పక విజయం సాధిస్తుందనే ధీమ భారతీయుల్లో స్పష్టంగా కనిపించింది. కరోనాపై గెలుపు మనదేనంటూ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు టపాసులు కాల్చారు. దీపావళి ముందే వచ్చిందా అనే రీతిలో ప్రజలు గో కరోనా కార్యక్రమాన్ని జరుపుకున్నారు. గ్రామాల్లో ప్రజులు తొమ్మిది ప్రమిదెలు, కొవ్వొత్తులు వెలిగించారు. 9 గంటలకు 9 నిమిషాలపాటు 9 దీపాలు వెలిగించి కొండంత ఆత్మసై్థర్యాన్ని పొందారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తదితర ప్రముఖులు దీపాలు వెలిగించారు. ఉమ్మడి శత్రువుపై సమిష్టి పోరాటం చేస్తామనే సంకేతాన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు చాటి చెప్పారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp