జగన్ మావయ్య అంటూ డెత్ సర్టిఫికెట్ కోరిన బాలిక సమస్య పరిష్కారం

By Raju VS Jun. 21, 2021, 07:30 am IST
జగన్ మావయ్య అంటూ డెత్ సర్టిఫికెట్ కోరిన బాలిక సమస్య పరిష్కారం

జగన్ మామయ్య... అమ్మ డెత్ సర్టిఫికెట్ ఇప్పించరూ...అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ అవుతున్న కధనం పై ఏపీ ప్రభుత్వం శర వేగంగా స్పందించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాలతో కదిలిన నెల్లూరు జిల్లా జడ్పీ సీఈఓ పి సుశీల, DMHO డాక్టర్ రాజ్యలక్ష్మి ఈ సమస్యను పరిష్కరించారు. నోషితకు తనతల్లి పోణక అనుపమ డెత్ సర్టిఫికెట్ అందజేశారు. మంత్రి దృష్టికి సమస్య రాగానే 15 నిమిషాల్లో ఈ సమస్యను పరిష్కరించడం విశేషం.

ముఖ్యమంత్రి గారికి ఒక బాలిక పెట్టుకున్న లేఖ విషయం తెలియగానే సత్వరమే స్పందించడంతో సమస్య తీరింది. నెల్లూరు జిల్లా అల్లూరు నగరపాలక పంచాయతీ కి చెo దిన బిరుదువోలు నోషిత తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం లేఖ పెట్టుకుంది. అయితే అది సకాలంలో రాకపోవడంతో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియా లో నోషిత పెట్టుకున్న లేఖ వైరల్ అయ్యింది. బాలిక సమస్యను కూడా కొందరు రాజకీయం చేసేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం వెంటనే స్పందించడంతో విషయం సమసిపోయింది.

తక్షణమే ఆమెకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చేలా సంబందించిన అధికారులకు అదేశాలు ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని ఫోన్లో ఆదేశించారు. దాంతో జిల్లా అధికారులు కదిలారు. ఆలూరు నగరపాలక పంచాయతీ ఇంచార్జి కమీషనర్, సెక్రటరీ ద్వారా డెత్ సర్టిఫికెట్ అందించారు. నెల రోజులుగా తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం తిరిగిన నోషితకు న్యాయం జరగలేదని ఆమె పోస్టులో పేర్కొన్నారు. సీఎం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

అయితే నోషిత తల్లిపోణక అనుపమ మే 5ననెల్లూరు షైన్ ప్రవేట్ హాస్పిటల్ లో కోవిడ్ వల్ల చనిపోయిన నేపథ్యంలో డెత్ సర్టిఫికెట్ కోసం ఆలూరు పంచాయతీ కి దరఖాస్తు చేసిన కారణంగానే జాప్యం జరిగిందని అధికారులు అంటున్నారు. జూన్ 11న తన తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం నోషిత ఆలూరు నగర పాలక పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసినట్టు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం నెల్లూరులో తీసుకోవాల్సిన డెత్ సర్టిఫికెట్ కోసం ఆలూరులో దరఖాస్తు చేసిన మూలంగానే ఆలశ్యమయ్యిందని అంటున్నారు. అయినప్పటికీ బాలిక వేదనను అర్థం చేసుకుని నెల్లూరులో డెత్ సర్టిఫికెట్ జారీ చేసి, ఆలూరు పంచాయతీ అధికారుల ద్వారా బాలికకు దానిని అందించడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp