GHMC - ఖాతా తెరిచిన టీఆర్ఎస్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. యూసఫ్‌గూడలో కారు పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్ జయకేతనం ఎగురవేశారు. మేయర్ స్థానాన్ని గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న ఆ పార్టీకి కౌంటింగ్ ఫలితాలు అనుకూలంగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ 52 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
మొత్తం 150 డివిజన్లకు గాను ఇప్పటి వరకు టీఆర్ఎస్ 52 డివిజన్లలో ఆధిక్యంలో ఉండగా.. ఒక డివిజన్లో గెలిచింది. బీజేపీ 20 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ ఖాతా తెరవాల్సి ఉంది. ఐఎంఐ మోహిదీపట్నంలో గెలిచింది. మరో ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక డివిజన్లో ఆధిక్యంలో ఉండడం పార్టీ కార్యకర్తలకు కొంత ఊరటనిస్తోంది.
Read Also : GHMC - బోణి కొట్టిన ఎంఐఎం


Click Here and join us to get our latest updates through WhatsApp