గంజాయి రవాణా గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే !...లాభాలు చూస్తే కళ్ళు బైర్లు!

By Voleti Divakar Nov. 29, 2020, 06:20 pm IST
గంజాయి రవాణా గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే !...లాభాలు చూస్తే కళ్ళు బైర్లు!

ఈ మధ్య విడుదలైన కార్తి నటించిన ఖైదీ చిత్రం డ్రగ్స్ రవాణా నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో డ్రగ్స్ రవాణాకు ప్రయత్నిస్తున్న ముఠా...దాన్ని అడ్డుకునేందుకు పోలీసుల ఛేజింగ్ లతో చాలా ఆసక్తి కరంగా సాగుతుంది. ఆస్థాయిలో కాకపోయినా విశాఖ ఏజెన్సీ నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు గంజాయి భారీగా అక్రమ రవాణా సాగుతుంది. గంజాయి స్మగ్లింగ్, విక్రయాల్లో వస్తున్న లాభాలే అక్రమ రవాణాదారులను సాహసానికి పురికొల్పుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో కొనుగోలు చేసిన ధరకు 10రెట్లు అక్కడ విక్రయిస్తారు.

తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన ఒక బృందం సినీ ఫక్కీలో ఒక వాహనంలో 180 కేజీల గంజాయిని తరలిస్తూ జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యా యి. ఒక యువతి సహా 10 మంది యువకులు, విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీకి చెందిన నలుగురు యువకులు వాహనంలో గంజాయిని తీసుకుని ఎస్కార్ట్ గా ముందో నలుగురు, వెనుకో నలుగురు మోటారు సైకిళ్లపై బయలుదేరారు. పోలీసుల తనిఖీలను గుర్తించి వెంటనే వాహనంలోని వారిని అప్రమత్తం చేసేందుకే ఈ ఎస్కార్ట్ ఏర్పాట్లు. అయితే పోలీసులకు అందిన సమాచారంతో వారు దొరికిపోయారు. 9 మంది పరారయ్యారు. మధ్యలో పోలీసులకు దొరకకుండా కేరళ వరకు ఈఎస్కార్ట్ కొనసాగుతుందని బొమ్మూరు సర్కిల్ ఇన స్పెక్టర్ కె లక్ష్మణరెడ్డి చెప్పారు. రూ. 9లక్షలకు కొనుగోలు చేసిన ఈగంజాయిని కేరళలో రూ. 90లక్షలకు విక్రయిస్తారు.

కరోనా సమయంలో గంజాయి ధర రెట్టింపు అయ్యిందని సర్కిల్ ఇన స్పెక్టర్ కె లక్ష్మణరెడ్డి వెల్లడించారు. విశాఖ ఏజెన్సీలో కేజీ రూ. 5వేలకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో రూ. 50వేలకు విక్రయిస్తారని ఆయన తెలిపారు. పోలీసులు పట్టుకునేది 10శాతమేనని, మిగిలిన 90శాతం వివిధ మార్గాల ద్వారా అక్రమంగా గమ్యస్థానాలకు చేరిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి సాగునే అరికడితేనే గంజాయి వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp