ఇచ్చిన మాటకు కట్టుబడి 'శ్రీనివాసులు'కు పట్టం కట్టిన జగన్

By Balu Chaganti Sep. 27, 2021, 11:00 am IST
ఇచ్చిన మాటకు కట్టుబడి 'శ్రీనివాసులు'కు పట్టం కట్టిన జగన్

ఏపీ వ్యాప్తంగా జరిగిన జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, ఇద్దరు వైస్‌ చైర్‌పర్సన్‌లు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల అధ్యక్షులు వైసీపీ వారే ఎన్నిక కావడం గమనార్హం. చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్‌గా వి.కోట జెడ్పీటీసీ శ్రీనివాసులు (వాసు)ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995లో నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమలు లోకి వచ్చాక జరిగిన ఎన్నికల సమయంలో ఈ జెడ్పీ చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. దీంతో కార్వేటినగరం జెడ్పీటీసీగా గెలుపొందిన టీడీపీ నాయకుడైన యు.గోవిందస్వామి జెడ్పీ పీఠాన్ని దక్కించుకున్నారు. 2001లో ఈ స్థానం బీసీ మహిళలకు రిజర్వ్ కావడంతో బైరెడ్డిపల్లి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన కాంగ్రెస్‌కు చెందిన రెడ్డెమ్మ చైర్‌పర్సన్‌ పదవిని దక్కించుకున్నారు.

Also Read : బోయ గిరిజమ్మ జెడ్పీ చైర్మన్ కావటానికి నాటి పసుపు కుంకుమ పోరాటమే కారణమా?

ఇక 2006లో జరిగిన ఎన్నికల్లో ఓసీ జనరల్‌కు కేటాయించగా కుప్పం ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డిని పదవి వరించింది. వైఎస్‌ చనిపోయాక సుబ్రహ్మణ్యం రెడ్డి పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లడంతో జెడ్పీ వైస్‌ చైర్మన్‌గా ఉన్న కుమార్‌రాజా ఇన్‌చార్జిగా పనిచేశారు. 2011- 14 మధ్య ప్రత్యేకాధికారుల పరిపాలన సాగగా ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఎలాంటి పోటీ లేకుండా పదవి దక్కించుకుంది. ఇక చైర్మన్‌ , వైస్‌ చైర్మన్ల పదవులు ఏకగీవ్రం కావడంతో చైర్మన్‌గా శ్రీనివాసులును, వైస్‌ చైర్మన్లుగా ధనంజయరెడ్డి, రమ్యలను ప్రిసైడింగ్‌ అధికారి, కలెక్టర్ హరినారాయణన్‌ ప్రకటించారు. చిత్తూరు జిల్లా పరిషత్‌ జనరల్‌ స్థానానికి రిజర్వ్ చేశారు. అయితే ఈ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ముందే ఫిక్స్ అయ్యారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తామని చెప్పిన జగన్‌ చిత్తూరు జెడ్పీ పీఠాన్ని బీసీలలో ఒకరికి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు.

Also Read : ఆ "తెగ"కు తొలిసారి జిల్లాస్థాయి పదవి

అలా పీఠం పలమనేరు నియోజకవర్గం నుంచి వీకోట జెడ్పీటీసీగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత శ్రీనివాసులు (వాసు)కు దక్కింది. జనరల్‌ కావడంతో ఈ పీఠంపై ముందు నుంచి మరో నులుగురు నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. అయినా సరే ఒక పక్క వైఎస్ కుటుంబానికి అలాగే మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడు కావడంతో శ్రీనివాసులుకే ఎట్టకేలకు పదవి దక్కింది. నిజానికి జీ శ్రీనివాసులు అసలు పేరు గోవిందప్ప శ్రీనివాసులు కాగా ఎంపీటీసీ సభ్యుడుగా తన రాజకీయ కెరీర్ ప్రారంభించిన ఆయన గతంలో సింగిల్‌ విండో అధ్యక్షుడిగా వ్యవహరించారు.

Also Read : విశ్వాసానికి అందలం.. దళిత మహిళా నేతకు జెడ్పి పదవి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp