సప్తగిరితో అన్యమత పత్రిక అంటూ ప్రచారం - తితిదే ఫిర్యాదు

By Krishna Babu Jul. 07, 2020, 06:55 am IST
సప్తగిరితో అన్యమత పత్రిక అంటూ ప్రచారం - తితిదే ఫిర్యాదు

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి పవిత్ర తిరుమల కేంద్రంగా ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం మతతత్వం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే తిరుమల కేంద్రంగా ప్రతిపక్షలు కొండపై శిలువ, ఆలయంలో అన్యమతస్తులు అంటూ లేవనేత్తిన అనేక అంశాలు రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం పై చేసిన దుష్ప్రచారం అని తేలగా, ఇప్పుడు తాజాగా తెలుగుదేశానికి వంత పాడే ఒక వార్తా సంస్థ తిరుమల కేంద్రంగా మరో ఆరోపణ చేస్తూ వార్తను ప్రచురించింది. ప్రభుత్వానికి కళంకం ఆపాదించే ప్రయత్నం చేసింది.

వివరాల్లోకి వెళితే -- సంవత్సరం చందా కట్టిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెలా ‘సప్తగిరి’ మాసపత్రికను పంపుతూ ఉంటుంది . కాగా గుంటూరులో మల్లిఖార్జునరావు పేటకు చెందిన ఓ వ్యక్తికి ఈ విధంగానే చందా కట్టగా ‘సప్తగిరి’అనే మాసపత్రికతో పాటు అన్యమతానికి చెందిన ‘సజీవసువార్త’ అనే ఇంకొక పత్రిక కూడా టీటీడీ పోస్టు ద్వారా వచ్చిందని, టీటీడీకి హైందవ దాతలు ఇచ్చే డొనేషన్స్ అన్యమత ప్రచారం కోసం వాడుతోందా అంటూ భక్తులు ఆవేదన చెందుతున్నారు అని ఈ వ్యవహారం చూస్తే టీటీడీ పని తీరు అర్ధమవుతోందని.. సదరు వ్యక్తికి సంభందించి సరైన వివరాలు ప్రకటించకుండానే వార్తను ప్రచారం చేసింది సదరు చానల్.

అయితే ఈ వ్యవహారం పై తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ గా స్పంధించింది. టిటిడి ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీయ‌డానికి కొంత మంది చేసిన చ‌ర్య‌గా భావించి దీనిపై నిజాల‌ను నిగ్గుతేల్చేందుకు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తునట్టు చెప్పుకొచ్చింది స‌ప్త‌గిరి మాస ప‌త్రిక‌ల‌ను పోస్ట‌ల్ శాఖ వారే ప్యాక్ చేసి, బ‌రువు చూసి పాఠ‌కుడి చిరునామాలు అతికించి బ‌ట్వాడ చేస్తారు. ఇందుకోసం పోస్ట‌ల్ శాఖ‌కు పోస్టేజి చార్జీల‌తో పాటు ఒక్కో ప్ర‌తికి రూ. 1.05 అద‌నంగా చెల్లిస్తోంది టిటిడి . పోస్ట‌ల్ శాఖ స‌ప్త‌గిరి మాస పత్రిక‌ను బుక్ పోస్టులో పంపుతుంది క‌నుక ఎలాంటి సీలు ఉండ‌దు. స‌ప్త‌గిరి మాస ప‌త్రిక ప్యాకింగ్, డెలివ‌రి భాధ్య‌త మొత్తం పోస్ట‌ల్ శాఖ‌ వారే చూస్తారు. ఇదే విషయానికి సంభందించి ప‌లు జిల్లాల‌కు చెందిన స‌ప్త‌గిరి పాఠ‌కుల‌కు ఫోన్ చేసి విచారించ‌గా ఎలాంటి అన్య‌మ‌త పుస్త‌కం త‌మ‌కు అంద‌లేద‌ని తెలియ‌జేశారు. దీనిని దురుద్దేశ చ‌ర్య‌గా భావిస్తూ దీనిపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి దీని వెనక ఎవరి ప్రోద్బలం ఉందో, ఎవరు దురుద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డారో నిజాలు తేల్చాలని పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు టిటిడి వర్గాలు తెలిపాయి .  

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp