రైతులకి ఉచిత బోర్లు - మరో హమీ అమలుకు జగన్ సర్కార్ నిర్ణయం

By Krishna Babu Jul. 04, 2020, 03:00 pm IST
రైతులకి ఉచిత బోర్లు - మరో హమీ అమలుకు జగన్ సర్కార్ నిర్ణయం

మానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు గడిచిన ఏడాదిలోనే 90% హామీలు నెరవేర్చి ఇప్పటీకే రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వ ఇప్పుడు మరో హామీని కూడా నెరవేర్చేందుకు రంగం సిద్దం చేసింది. తాను చెప్పిన నవరత్నాల్లో భాగంగా అర్హులైన రైతులందరికి ఉచితంగా బోర్లు తవ్వించేందుకు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతిరాజ్ రూరల్ డెవలప్మెంట్ కింద నిన్నటి రోజున విడుదల చేసిన జీవో నెంబర్ 641 ప్రకారం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న రైతులు భూగర్భ జలాలను సముచితంగా ఉపయోగించుకోవడం ద్వారా అవకాశం ఉన్న మేరకు ప్రతి ఎకరా సాగులోకి తీసుకుని రావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతీ రైతుకి బోర్లు వేయించడానికి సిద్దమైందని ఈ పథకాన్ని రైతులందరు సద్వినియోగం చేసుకుని బోరు బావులు తవ్వించుకోవాలని ఇది పూర్తిగా ఉచితం అని జీవోలో చెప్పుకొచ్చింది.

అర్హత ప్రమాణం:

1. బోర్-బావి / ట్యూబ్-వెల్ / ఓపెన్-బావి లేకుండా 5 ఎకరాల వరకు భూమి ఉన్న ఏ రైతైనా దీనికి అర్హులు
2. రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి.
3. ఒక రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి లేకపోతే, 2.5 ఎకరాల భూమి నుండి గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు కలిసి ఉన్నా సరే అర్హులుగా పరిగణించబడుతుంది.

అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో / ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వాటిని పరిశీలించి అర్హత ఉన్న లబ్దిదారులను గుర్తించి వారికి ఉచితంగా బోర్లు వేయించే ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వం జీవోలో చెప్పుకొచ్చింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp