ప్రైవేట్ బస్సులో మంటలు - ఐదుగురు సజీవ దహనం

By Kiran.G Aug. 12, 2020, 08:19 am IST
ప్రైవేట్ బస్సులో మంటలు - ఐదుగురు సజీవ దహనం

కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవ దహనం అయ్యారు.

వికారల్లోకి వెళితే కర్ణాటక చిత్రదుర్గ జిల్లా హిరియూరు వద్ద ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. బస్సు బెంగుళూరు నుండి విజయపుర వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఒక మహిళ ఉన్నారు. అనేకమంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేసింది.  ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని హిరయూర్ ఎస్పీ రాధిక సందర్శించారు.

ఇంజిన్‌లో లోపం వల్ల మంటలు చెలరేగి, బస్సు మొత్తం వ్యాపించాయని ట్రావెల్స్ యాజమాన్యం తెలిపింది. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహిరించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్దారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp