షాకింగ్ : కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం - 8 మంది మృతి

By Kiran.G Aug. 06, 2020, 10:03 am IST
షాకింగ్ : కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం - 8 మంది మృతి

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది కోవిడ్ పేషెంట్స్ ప్రాణాలు కోల్పోగా ఒకరికి గాయాలయ్యాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో 40 మంది రోగులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళితే అహ్మదాబాద్‌లోని నవరంగపురలో ఉన్న శ్రేయ్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హాస్పిటల్ లో ఉన్న వ్యర్ధాలకు నిప్పు అంటుకుని ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని అహ్మదాబాద్ నగర అసిస్టెంట్ కమిషనర్ ఎల్బీ జాలా పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై విచారణ సాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్ లో శ్రేయ్ ఆసుపత్రిని కరోనా బాధితులకు చికిత్సను అందించడం కోసం కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు.

ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3.30 కి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు వ్యాపించాయి. అవి ఇతర బ్లాకులకు కూడా వ్యాపించడంతో ఎనిమిది మంది రోగులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని కమిషనర్ వెల్లడించారు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp