వ్యవసాయం దండగ అనలేదా బాబు??

By Surya.K.R Dec. 11, 2019, 07:57 pm IST
వ్యవసాయం దండగ అనలేదా బాబు??

రాజకీయాలు అంటేనే అవకాశవాదం, మాట మార్చటం అనే భావన ప్రజల్లో పాతుకుపొయింది, రాజకీయంగా ఎప్పుడైనా సంకట పరిస్థితి ఎదురైతే టక్కున మాట మార్చేయగల సమర్ధులు మన రాజకీయనాయకులు అనేది కాదనలేని సత్యం. కానీ చంద్రబాబు గారు మాత్రం దీనికి రెండు ఆకులు ఎక్కువే అని చెపచ్చు. ఆయన గతంలో అడ్మినిస్ట్రేషన్ పేరుతో , వరల్డ్ బ్యాంకు వ్యామోహంలో, టెక్నాలజీనే ప్రపంచంగా బ్రతుకుతున్న రోజులవి. ఆ రోజుల్లో కాంగ్రెస్ కి సరైన నాయకత్వం లేకపొవటం , రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయం లేకపొవటంతో ఆయన తాను చెప్పిందే వేదంగా , చెసేదే ధర్మంగా వార్తా పత్రికలు ప్రచురిస్తున్న రోజుల్లో, ఏమి మాట్లాడుతున్నరో కూడా ఆలోచించకుండా మాట్లాడేసి ఏకఛత్రాధిపత్యం చలాయించారు. పొరపాటున తప్పు ఏదైనా మాట్లాడితే ఆ మాటని బయటికి పోనియ్యకుండా టక్కుమని ఆపేసే మీడీయా వ్యవస్థ ఆనాడు ఆయన చుట్టు ఉండేది. అప్పట్లో అదే ఆయన ధైర్యం.

కానీ నేడు సోషల్ మీడియా యుగం వచ్చిన తరువాత, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత కూడా గతంలో మాదిరి చెప్పిన మాటను చెప్పలేదు అని, చేసిన పని చెయలేదని బుకాయించటం చూస్తే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా ఇలాంటి సంఘటనే అసెంబ్లీ సాక్షిగా జరిగింది, తాను వ్యవసాయం దండగా అని ఎక్కడా అనలేదని, నేను అన్నట్టు నీరుపిస్తే రాజీనామా చేస్తానని గట్టిగానే చెప్పారు చంద్రబాబు. ఆయన చెప్పిన విధానం చూస్తే నిజంగానే అనలేదేమో,ఎన్నో ఏళ్ళుగా ఆయన పై ఈ విషయం మీద అందరు బురదజల్లి అభాండాలు వేస్తున్నారేమోనని అనిపించక మానదు.

నిజానికి సరిగ్గా 20ఏళ్ళ క్రిందట 1999 డిసెంబర్లో ఒక సభలో ఆయన ( వ్యవసాయం పై ఆధారపడటం టైం వేస్ట్ ) అన్నారు, అంటే ఆయన ఉద్దేశంలో వ్యవసాయం దండగ అని అర్ధం కాదా ? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆరోజులలో నిజానికి ప్రభుత్వ కార్యక్రమ ప్రాధాన్యత క్రమంలో వ్యవసాయం అట్టడుగు స్థానంలో ఉండేది, అప్పటికి ఆయన ముఖ్యమంత్రి అయి 5 ఏళ్ళు గడిచిన సాగునీటి ప్రాజెక్టులకు చిల్లిగవ్వ విదల్చలేదు సరికదా పంట వేసి నష్టపొయాం అని ఆయన దగ్గర రైతులు ఏకరువు పెట్టుకుంటే ఎవరిని అడిగి మీరు పంట వేశారు, అని ఎదురు ప్రశ్నించారు. పంట మార్పిడి చెయకపొవటం మీ తప్పు అన్నట్టు మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతుని పూర్తిగా పక్కన పెట్టారు తనని తాను రాష్ట్రానికి CEO గా చాటుకుని అంతర్జాతియ రుణదాతల బాజభజంత్రీలలో పులకించిపొయారు. ఈ దేశ చర్రిత్రలో రైతులని చిన్నచూపు చుసి , ఏకంగా వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు తప్ప మరొకరు లేరు.

20ఏళ్ళ నాడు జరిగింది కదా, ఇప్పుడు ఎవరికి తెలుస్తుందిలే అనుకున్నారో ఏమో , అసెంబ్లీలో చాలా గట్టిగా నేను వ్యవసాయం దండగా అనలేదు,అలా అని ఉంటే నిరూపించండి నేను రాజీనామకు సిద్దం అని బిగ్గరగా అరిచి మరీ శపథం చేశారు. కాని ఇవి ఈనాడు ఆంద్రజ్యోతిల రోజులు కావు , సోషల్ మీడియా రోజులు అని తెలుసుకోలేకపొవటం బాధాకరం. ఇప్పుడున్న చంద్రబాబు వయస్సుకు ఆనాడు పరిస్థితులకి అలా నేను అని ఉండచ్చని హుందాగా ఒప్పుకుంటే గౌరవం దక్కేది. కాని నేను అనలేదని బుకాయించి మరీ చెప్పటంతో ఆనాడు పరిణామాలకు సాక్షులుగా నిలిచిన వారు "అనలేదా చంద్రబాబు" అని ముక్కున వేలువేసేకుంటున్నారు. సాక్ష్యాలు చూపి మరి రాజీనామా చేస్తారా చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నారు, ఇప్పుడు చంద్రబాబు ఏమంటారో ????

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp