ఆలయాలపై దాడులు.. నిజా నిజాలేంటి..?

By Voleti Divakar Oct. 01, 2020, 04:50 pm IST
ఆలయాలపై దాడులు.. నిజా నిజాలేంటి..?

వైఎస్సార్ సిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులు దాడులు పెరిగిపోయాయని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, బిజెపి పార్టీల నాయకులు ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో రాద్ధాంతం, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్ర విభజన తరువాత ఈ ఏడాదే ఆలయాలపై దాడులు తక్కువగా జరిగాయని డిజిపి గౌతమ్ సవాంగ్ ప్రకటించడం గమనార్హం.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆలయాలపై దాడులు ఎక్కువగా జరిగాయని కూడా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై ఆయా పార్టీల నాయకులు ఏమంటారో..? ఆలయాల పై దాడుల గణాంకాలు పరిశీలిస్తే టిడిపి అధికారంలో ఉన్న 2015లో 290, 2016లో 332, 2017లో 318, 2018లో 267 ఆలయాలపై దాడులు జరిగాయి. 2019లో 319, ఈ ఏడాది ఇప్పటి వరకు 228 దాడులు జరిగాయి. అయితే అంతర్వేది రథం దగ్ధం, విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోని రథానికి సంబంధించిన వెండి సింహాసనం చోరీ, రాష్ట్రంలో ఇతర ఆలయాలపై దాడులు ఇటీవల కాలంలో రాజకీయంగా దుమారం లేపాయి.

తిరుమల డిక్లరేషన్ పై తీవ్రస్థాయిలో చర్చ సాగింది. ఈ అంశాలను టిడిపి, బిజెపిలు రాజకీయంగా వినియోగించుకునేందుకు ప్రయత్నించాయి. ఆలయాలపై దాడుల సంఘటనల్లో ఉద్దేశపూర్వకంగా జరిగినవి కాదని కూడా డిజిపి స్పష్టం చేస్తున్నారు. మూడ నమ్మకాలు, చోరీ ప్రయత్నాలే ఈ సంఘటనలకు కారణమని విశ్లేషించారు.

అంతర్వేది రథం దగ్ధం కేసును ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. విజయవాడలో సింహాసనం చోరీ కేసు దర్యాప్తులో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో మత కల్లోలాలు, అరాచకాలు, అశాంతిని కోరుకుంటుందా అన్నది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకుంటే ప్రతిపక్షాల విమర్శల్లో వాస్తవం ఎంత అనేది ఇట్టే తెలుస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp