దేశాన్ని పట్టిపీడిస్తున్న దొంగనోట్లు

By Kiran.G Dec. 08, 2019, 08:03 am IST
దేశాన్ని పట్టిపీడిస్తున్న దొంగనోట్లు

దేశ అర్ధిక వ్యవస్ధ దెబ్బతినడానికి దొంగ నోట్ల ముద్రణ కూడా ఓ కారణం. మందగించిన ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్ 2016 నవంబర్ నెలలో నోట్ల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పాత రూ.1000, 500 నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను చలామణిలోకి తీసుకువచ్చింది.

దొంగ నోట్ల ముద్రణకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఎప్పటికప్పుడు కొందరు వ్యక్తులు నకిలీ నోట్లను తయారు చేస్తూ వాటిని మార్కెట్ లో చలామణి చేసి వ్యాపారం చేస్తున్నారు.

నకిలీ నోట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక పలు కఠోర వాస్తవాలని వెల్లడించింది. 2016-17లో 7,62,072 నోట్లను నకిలీవిగా గుర్తిస్తే, 2017-18లో దాదాపు 31.4 శాతం తక్కువగా 5,22,783 నోట్లను మాత్రమే గుర్తించారు. నకిలీ చేయలేరని గర్వంగా ప్రకటించినా... రూ.2,000 నోట్లు 2017-18లో 17,929 నోట్లను పట్టుకున్నారు. అలాగే 9,892 రూ.500 నోట్లను నకిలీవని గుర్తించారు.

కేవలం ఈ నెల రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లో రెండు చోట్ల దొంగ నోట్ల ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. నవంబర్ చివరలో విశాఖ కేంద్రంగా జరుగుతున్న దొంగ నోట్ల వ్యవహారం బయటపడగా, ఇప్పుడు కడపలో గుట్టు చప్పుడు కాకుండా ముద్రిస్తున్న దొంగ నోట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కూడా విచ్చల విడిగా దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ దొంగ నోట్ల ముద్రణ వ్యవహారానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చెక్ పెట్టనుంది. అసలు ఈ దొంగ నోట్ల ముద్రణను అడ్డుకోవడం అసాధ్యమా...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp