తనకు కరోనా వచ్చిందని చెప్పిన ఏపీ మాజీ మంత్రి.. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న నేతలు

By Kotireddy Palukuri Jul. 04, 2020, 11:12 am IST
తనకు కరోనా వచ్చిందని చెప్పిన ఏపీ మాజీ మంత్రి..  ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న నేతలు

బీజేపీ నేత, ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా వైరస్‌ సోకింది. పరీక్షల్లో తనక పాజిటివ్‌ అని తేలిందని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా వచ్చినా భయపడాల్సిన పనిలేదని, అది ప్రమాదకారి కాదని మాణిక్యాలరావు పేర్కొన్నారు. అదేమీ రాకూడని రోగం కాదన్నారు. సామాజిక దూరం పాటించకుండా ఉంటేనే కరోనా వస్తుందన్నారు. వాహనాల్లో ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. భయపడి టెస్టులు చేయించుకోవడం మనొద్దని మాణిక్యాలరావు సూచించారు.

తమకు వైరస్‌ సోకిన విషయం స్వయంగా వెల్లడిస్తూ తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ప్రజలను వైరస్‌ పట్ల చైతన్యవంతులను చేస్తున్నారు. వైరస్‌ వస్తే దాచకుండా పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ తరహా వీడియో సందేశాన్ని మొదట వైసీపీ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్య ప్రారంభించారు. తనకు కరోనా వైరస్‌ వచ్చిందని ఆయన స్వయంగా వీడియో సందేశంలో వెల్లడించారు. తాజాగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు అదే బాటలో పయనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వైరస్‌ వ్యాపించిన ప్రారంభంలో ప్రజలు అవగాహనలేమితో వైరస్‌ సోకినా చెప్పేవారు కాదు. అధికారులే వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించాల్సిన పరిస్థితి ఉండేది. వైరస్‌ సోకిన విషయం బయటకు చెప్పడం అవమానంగా భావించారు. ఇతరులు కూడా వైరస్‌ సోకిన వారి పట్ల వివక్ష చూపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా వైరస్‌ పట్ల అవగాహన కల్పించారు. వైరస్‌ సోకిన వారిని అంటరాని వారిగా చూడొద్దని సూచించారు. వైరస్‌ తనతోపాటు ఎవరికైనా సరే వచ్చే అవకాశం ఉందని ప్రజల్లో భయాందోళనను పొగొట్టేందుకు యత్నించారు. ప్రస్తుతం ప్రజల్లో అపోహలు తొలిగాయి. వైరస్‌ వచ్చినా భయపడడం లేదు. పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేతలు కూడా తమకు వైరస్‌ సోకిన విషయం బయటకు చెప్పడం వల్ల ప్రజలల్లో అవగాహన మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp