ప్రభుత్వ నిర్ణయానికి జనసేన మద్దతు !!

By Siva Racharla Dec. 11, 2019, 10:40 am IST
ప్రభుత్వ నిర్ణయానికి జనసేన మద్దతు !!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషుమీడియం విద్య ప్రవేశపెడుతు తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఊరు ఊరు తిరిగి సభలు పెట్టిన విషయం విదితమే.

భాషా సరస్వతి,తెలుగు సుడి ,తెలుగులో చదువు కోకుంటే రేపులు చేయక ఏమి చేస్తారు? ఇంగ్లీష్ విద్య వలన మత మార్పిడిలు పెరుగుతాయి .. ఇలా అనేక వాఖ్యలు పవన్ కళ్యాణ్ చేశాడు .

ఈ ఉదయం శాసనసభలో ఇంగ్లీష్ మీడియం విద్య మీద జరిగిన చర్చలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇంగ్లీష్ మీడియం విద్య మీద ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయానికి భిన్నంగా జనసేన ఏకైక ఎమ్మెల్యే వర ప్రసాద్ మాట్లాడటం,ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం ఆశ్చర్యకరం.

రాపాక వర ప్రసాద్ ప్రభుత్వాన్ని సమర్ధించటం మీద పావన కళ్యాణ్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొనింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp