ఇంగ్లీష్ మీడియం భోదన పై ఉండవల్లి స్పందన

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన్గ్ల పై పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియం బోధనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పేమీ లేదన్నారు. గురువారం రాజమండ్రిలో మీడియాలో మాట్లాడుతూ.. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి ఇంగ్లీష్ మాధ్యమంలో బోధిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగును సబ్జెక్టుగా కొనసాగించాలని సూచించారు.
ఇసుక సమస్యను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులకు అవినీతి మకిలి అంటుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని లోక్సభలో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తాలని సీఎం జగన్కు లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. రాజమండ్రి దానవైపేట ప్రకాష్ నగర్ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని ‘కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ సెంటర్’ గా వ్యవహరిస్తామని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

Click Here and join us on WhatsApp to get latest updates.