ఎన్కౌంటర్ ఎఫెక్ట్ - హంతకుడి ఆత్మహత్య

By Surya.K.R Dec. 09, 2019, 05:03 pm IST
ఎన్కౌంటర్ ఎఫెక్ట్ -  హంతకుడి ఆత్మహత్య

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటనలో నిందితులని తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన సామాన్యుల్లో ధైర్యాన్ని నింపగా , ఉన్మాదుల్లో మాత్రం భయాన్ని నింపింది. ఎంతో కాలంగా పోలీసులకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఒక ఉన్మాది ఇప్పుడు పోలీసులకి శవమై దొరికాడు, పోలీసులకి దొరికితే తనకి దిశ నిందితులకి పట్టిన గతే పడుతుందని భావించి ఆత్మహత్య చేసుకునట్టు పోలీసులు భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నెమలి కొండకు చెందిన లక్ష్మీరాజంకు విమలతో 12 ఏళ్ళ క్రితం పెళ్లి అయింది. పెళ్లి అయిన రోజు నుంచే తన ఉన్మాద చర్యతో పిల్లలను , భార్యను వేధింపులకు గురిచేసేవాడు , ఇతని ఉన్మాద చర్యలతో విసిగిపోయిన భార్య విమల ఈ మే నెలలో భర్తపై పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఈ చర్యతో లక్ష్మీరాజం మారినట్టు నటించి కోర్టులో భార్యతో రాజీ చేసుకుని సిద్దిపేటలో కాపురం పెట్టాడు. గతనెల 21న భార్య విమలను పిల్లలను ఆమె పుట్టింటికి పంపి అదే రోజు రాత్రి కట్టుకున్న భార్య, కన్న కూతురతో సహ విమల కుటుంబ సభ్యులపై టర్పంటైన్ చల్లి నిప్పు పెట్టి వారిని హతమార్చి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కర్కోటకుడి కోసం హైద్రబాద్, బెంగుళూరు, జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాలలో తీవ్రంగా గాలించిన ఆచూకీ దొరకలేదు, ఈ క్రమంలోం ఈ రోజు అతను కొండగట్టు వద్ద చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు

దిశా ఘటనలో పోలీసుల చర్యతో తాను పోలీసులకి దొరికినా జైలులో పెట్టకుండ , ఎన్ కౌంటర్ చేసి చంపేస్తారని భయపడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చర్చ జరుగుతోంది , ఏది ఏమైనా దిశ ఘటన ఉన్మాదులలో భయాన్ని నింపిందనే వాదనకి ఈ ఉదంతం మరింత బలాన్ని చేకూరుస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp