ఎన్కౌంటర్ పై సినీ ప్రముఖుల స్పందన.. పవన్ స్పందనపై ఆసక్తి

By Kotireddy Palukuri Dec. 06, 2019, 12:45 pm IST
ఎన్కౌంటర్ పై సినీ ప్రముఖుల స్పందన.. పవన్ స్పందనపై ఆసక్తి

దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా హర్షాతికేరాలు వ్యక్తమవుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు పోలీసుల చర్యలను సమర్థిస్తున్నారు. తెలుగు, తమిళ సినీ తారలు దిశకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు. నాగార్జున, సమంత, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, విశాల్, హన్సిక, స్మిత, యాంకర్ అనసూయ, రవితేజ, దర్శకుడు పూరి జగన్నాద్ పోలీసు చర్యను సమర్ధించారు.

సినీ తారలు అందరూ ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్ పై స్పందిస్తున్నారు. పలువురు ఘటన జరిగిన సమయంలోనే ఖండించారు. ఐతే అందరికి భిన్నంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రేప్ చేసిన వారిని ఉరి తీయాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలు అంటూ వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. తాజాగా గా నిందుతులను ఎన్కౌంటర్ చేయడంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారోనని తెలుగు రాష్ట్రాలలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలన్న పవన్.. ఎన్కౌంటర్ ను సమర్థిస్తారా..? లేక వ్యతిరేకిస్తారా..? వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp