మేయర్ అభ్యర్థిగా సింధు యేనా..?

By Voleti Divakar Dec. 05, 2020, 10:17 am IST
మేయర్ అభ్యర్థిగా సింధు యేనా..?

ప్రగతిభవన్ కు రావాల్సిందిగా భారతినగర్ నుంచి గెలుపొందిన సిండుకు కేసీఆర్ నుంచి పిలుపు అన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గ్రేటర్ ఫలితాలు హంగ్ వైపు పయనిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ పిలుపు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎంఐఎం తో పొత్తు పెట్టుకుని మేయర్ పీఠాన్ని సాధిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది.

భారతీనగర్ డివిజన్ నుండి గెలిచిన సింధు మేయర్ అభ్యర్థి గా దాదాపు ఖాయమనే ప్రచారం సాగుతోంది. బారతీనగర్ నుండి సింధు వరుసగా రెండోసారి గెలిచారు. గ్రేటర్ ఎన్నకల్లో డివిజన్ల గెలుపు పరంగా సింగిల్ లార్జెస్టు పార్టీగా టీఆర్ఎస్ నిలిచింది. అందుకనే అంతిమ ఫలితాలతో సంబంధం లేకుండానే మేయర్ అభ్యర్ధి ఎంపికపై కేసీయార్ దృష్టి పెట్టారు.

అధికారపార్టీ తరపున సింధుతో పాటు రాజ్యసభ ఎంపి కే కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రి పీజేఆర్ కూతురు విజయారెడ్డి తదితరులు గెలిచారు. అయితే మేయర్ అభ్యర్ధి జనరల్ మహిళకు రిజర్వు చేయటంతో ప్రధానంగా ఓసీల నుండి గెలిచిన వారిలోనే కేసీయార్ ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు. ఇందులో భాగంగానే సింధు ఆదర్శ్ రెడ్డిని రమ్మంటు కేసీయార్ కబురు చేశారని సమాచారం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp