అప్‌డేట్‌ కావడం లేదా..!

By Jaswanth.T Oct. 28, 2020, 07:45 pm IST
అప్‌డేట్‌ కావడం లేదా..!
నారా చంద్రబాబునాయుడు.. స్వయం ప్రకటిత ఆధునిక నాయకుడు. ఆయనతోపాటు, ఆయన వందమాగధులు కూడా ఇదే విషయాన్ని పదేపదే డప్పేస్తుంటారు. తనను తాను ప్రమోట్‌ చేసుకోవడాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకునే చంద్రబాబు, ప్రజల కోసం చేసే ఆలోచనల విషయంలో మాత్రం అప్‌డేట్‌ కావడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. 2019 ఎన్నికల తరువాత నుంచి ఆయన వ్యవహారశైలి గమనించి వారెవరైనా గానీ ఇదే విషయాన్ని తేల్చేస్తున్నారు. తరచు చేసే జూమ్‌ సమావేశాల్లో సైతం చంద్రబాబు తీరు ఇదే రీతిలో ఉంటోందన్న విమర్శలుఉన్నాయి.

ఏపీలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి యేడాదిన్నర అవుతోంది. అయితే ఈ కాలంలో ప్రభుత్వంలో ఎత్తిచూపే తప్పులు ఏవో కొన్ని లేకుండా పోవు. వాటిని ఆసరాగా చేసుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని జనంలోకి చొచ్చుకుపోయే విధంగా కార్యాచరణతో ముందుకుపోవాల్సిన దశలో అటువంటి ప్రయత్నాలే చేయడం లేదంటున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను ప్రధానంగా పదేపదే చెబుతూ జనాన్ని ఆకట్టుకునేందుకు చంద్రబాబు, ఆయన పార్టీ బృందాలు తీవ్రంగా శ్రమించారు. అయితే ఆ విషయాలను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదని ఎన్నికల ఫలితాలు తేల్చేసాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అవే విషయలను, అది కూడా తానేదో గొప్పగా చేసేసాను అన్నరీతిలో చెప్పుకునేందుకు చంద్రబాబు ఆసక్తిచూపిస్తుండడాన్ని ఆక్షేపిస్తున్నారు. అది జరిగిపోయిన ఎపిసోడ్‌అని ఫ్లాష్‌బ్యాక్‌లు వేసి జనానికి గుర్తుచేసేంత గొప్పదనం లేదని తేల్చేస్తున్నారు. పైగా గతాన్ని తవ్వి తమకుతాముగానే బైటకు తీస్తే అందులోని లోపాలు తమ మెడకే చుట్టుకుంటాయని తెలుగుతమ్ముళ్ళు తలలు బాదుకుంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఇదే ధోరణిని కొనసాగిస్తుండడంతో వారంతా అమోయ పరిస్థితుల్లోకి జారుకుంటున్నారంటున్నారు.

ప్రతిపక్షనేతగా కొత్తవిషయం ఏదైనా చెబుతారేమోనన్న సహజ ఆసక్తితో చూసే ప్రజలకు కూడా చంద్రబాబు తీరుతో ఇప్పుడా ఆసక్తి సన్నగిల్లిపోయింది. మీడియా ప్రతినిధులు కూడా తప్పదన్నట్టుగానే సదరు మీట్‌లను కవర్‌ చేసేస్తున్నట్టుగా మీడియా వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ఇదే తీరుతో వ్యవహారం ఎంతో కాలం ముందుకు నడవదన్న సంకేతాలను కూడా పలువురు నాయకులు బాహాటంగానే విమర్శల రూపంలో తెలియజేస్తున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా గతంలో మేం చేసాం కాబట్టి గొప్పగా చేసాం.. ఇప్పుడున్నవారు ఏం చేయడం లేదు.. ఇదే రీతిలో విమర్శలతోనే పుణ్యకాలం కాస్తా పూర్తిచేసేసుకుంటే పార్టీ పరిస్థితి ఏంటన్న భయంతో తెలుగుతమ్ముళ్ళకు రాన్రాను ఎక్కువైపోతోందట..
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp