బాబుతో పెట్టుకుంటే అంతే అఖిల ప్రియ!

By Mavuri S Jan. 18, 2021, 07:31 pm IST
బాబుతో పెట్టుకుంటే అంతే  అఖిల ప్రియ!

మన ఇంట్లోని వారు తెలిసో తెలియకో తప్పు చేస్తే వారికీ దూరం అయిపోతామా? మనవాళ్ళు కాకుండా పోతారా? లేదా వాళ్లని ఇంకెప్పటికీ కలవకుండా ఇగ్నోర్ చేస్తామా? అదేమీ ఉండదు కదా..! మన వారు తప్పు చేసిన వారికి నైతికంగా మద్దతుగా నిలబడతాం. వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తాం. అవసరం మేరకు సూచనలు అందించి తగిన విధంగా చెప్తం.. అది ఒక కుటుంబం అయినా ఒక పార్టీ అయినా.. ఇదే షరతు వర్తిస్తుంది కదా! కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర మాత్రం ఇవేవీ ఉండవు. మానవత్వం మంచి అంటే ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. తన పార్టీలోని వారికి కనీస మద్దతు ఉండదు. తనకు అవసరం మేరకే ఆయన పనులు చేయించుకుంటారు. తర్వాత వదిలించుకుంటారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన టిడిపి నేత భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ్ రాములు హైదరాబాదులోని బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఇరుక్కుపోయారు. అఖిలప్రియకు సోమవారం సైతం కోర్టు బెయిల్ మంజూరుకు విముఖత చూపింది. ప్రస్తుతం కేసు చాలా సీరియస్గా ఉంది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ కేసు మీద ప్రధాన దృష్టి సారించి నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకుంది. అయితే మాజీ మంత్రిగా పనిచేసిన అఖిలప్రియకు తెదేపా నాయకులు నుంచి పార్టీ నుంచి ఇప్పుడు కనీస మద్దతు లభించకపోవడం విశేషం.

అఖిల చేసింది తప్పే అయినా!

మాజీ మంత్రి అఖిలప్రియ చేసింది అక్షరాల తప్పే. ప్రస్తుతం పోలీసు దర్యాప్తులో ఆమె కిడ్నాప్ చేసిన సహకరించిన విషయాలన్నీ బయటకు వచ్చాయి. అయితే టిడిపి హయాంలో మాజీ మంత్రిగా పని చేసిన ఆమెకు ఇప్పుడు కనీసం నాయకుల వద్ద నుంచి పరామర్శ కూడా లేకపోవడం విశేషం. అఖిల చేసింది తప్పే అయినా ఒక ఆడపిల్ల గా ఆమెకు కీలకమైన సమయంలో మద్దతుగా నిలబడాల్సిన పార్టీ దానిని వదిలేయడం అంటే పార్టీ మనుగడకు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది.

అంత అన్నారు అప్పుడు!

టిడిపి హయాంలో నంద్యాల ఉప ఎన్నిక సమయంలో భూమా కుటుంబానికి తాను ఎప్పటికీ అండగా నిలబడతానని చంద్రబాబు చెప్పిన మాటలు ఎప్పటికి తగ్గదు టిడిపి గుర్తు వస్తూనే ఉంటాయి. భూమా నాగిరెడ్డి తెలుగుదేశం కు కర్నూలు జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. ఒకప్పుడు కర్నూలులో భూమా మొత్తం చక్రం చెప్పడంతో టిడిపి పూర్తిస్థాయి సీట్లను గెలుచుకుంది. అలాంటి భూమా కుటుంబాన్ని ఇప్పుడు కనీసం చంద్రబాబు పట్టించుకోకపోవడం, కనీసం న్యాయపరంగా అయిన భూమా అఖిలప్రియ కు సాయం చెయ్యక పోవడం చూస్తుంటే చంద్రబాబు అసలు నైజం అర్థమవుతుంది. అఖిల ప్రియకు ఇప్పుడు ఏమైనా పండగ నిలబడినట్లు స్టేట్మెంట్ ఇచ్చిన పార్టీకి నష్టం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడు గానీ అటు టీడీపీ అనుకూల మీడియా కానీ అఖిల ప్రియ పేరే ఎత్తడానికి భయపడుతున్నారు. అంటే చంద్రబాబు దృష్టిలో ఓడ లో ఉన్నందుకు ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగానే ఉందని టిడిపి కార్యకర్తలు సైతం చెప్పుకోవడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp