వల్లభనేని అసెంబ్లీలో వంశీ ఎక్కడ కూర్చున్నారో తెలుసా ?

By Kiran.G Dec. 09, 2019, 10:34 am IST
వల్లభనేని అసెంబ్లీలో వంశీ ఎక్కడ కూర్చున్నారో తెలుసా ?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా ఇటీవలే వైసీపీలో చేరతానని ప్రకటించిన వల్లభనేని వంశీ ఎక్కడ కూర్చుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. ఈ సమావేశాల్లో వంశీ మద్దతు పలికిన వైసీపీ పక్కన కూర్చుంటారా లేక పార్టీ తరపున రాజీనామా చేసిన టీడీపీ తరపున కూర్చుంటారా అనేది చర్చనీయాంశం అయింది. కానీ వంశీ అటు ఇటు కాకుండా టీడీపీ సభ్యులు కూర్చున్న వెనుకవైపు బెంచీలో కూర్చున్నారు.

టీడీపీకి రాజీనామా చేయడం ఇటు వైసీపీలోకి ఇంకా చేరకపోవడంతో ఈ విధంగా టీడీపీ సభ్యులు కూర్చున్న వెనుక వైపు బెంచీలో వంశీ కూర్చున్నట్లు తెలుస్తుంది. కాగా గతంలో టీడీపీ విధానాలను తీవ్రంగా విమర్శించిన వంశీ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత వల్లభనేని వంశి వైసీపీలోకి చేరనున్నారని తెలుస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp