బేబి స్టెప్స్ ఇప్పుడే మొదలయ్యాయి - దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై రేణుదేశాయి.

By Surya.K.R Dec. 06, 2019, 01:30 pm IST
బేబి స్టెప్స్ ఇప్పుడే మొదలయ్యాయి - దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై రేణుదేశాయి.

సంచలం రేపిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయంలో దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు తమ భావాలను వ్యక్తపరుస్తు వస్తున్నారు, దిశ ఆత్మకు శాంతి చేకూరిందని, నిందితులకు తగిన శాస్తి జరిగిందని సోషల్ మీడియా మాద్యమాల ద్వారా తమ భావమును వ్యక్తపరుస్తు వస్తున్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై ఒక ప్రముఖ చానల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న రేణుదేశాయి కూడా ఈ ఘటనపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Read Also: బహిరంగ శిక్షలు అమలు చేయాలి- పవన్ కళ్యాణ్

ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలపై చర్యలు తీసుకోవటంలో ఇప్పుడే బేబి స్టెప్స్ మొదలయ్యాయని, తప్పుచేసిన వ్యక్తులు ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించలేదు కాబట్టి, ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగింది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరంలేదని ,నేడు దేశంలో అనేక ప్రదేశాలలో టపాసులు పేల్చి నరకాసురులు చచ్చారని పండగ చేసుకుంటున్నారు ఇది దేశానికి రెండో దీపావళని, ఎట్టకేలకు ప్రభుత్వాలు పొలీసులు ప్రజల విజ్ఞప్తిని పరిగణంలోకి తీసుకుంటున్నందుకు, మన సమాజంలో దేశంలో ఆడవారి భద్రత అనేది ఒక అతిపెద్ద సమస్యగా గుర్తించినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp