ఏపి దిశ చట్టం

By Suresh Dec. 12, 2019, 07:28 am IST
ఏపి దిశ చట్టం

మహిళలకు అండగా ఉండేందుకు చరిత్రాత్మక బిల్లుకు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇటీవల దిశ సహా దేశంలో చోటుచేసుకున్న ఘటనల తర్వాత వైయస్‌.జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ భేటీలో భాగంగా మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అత్యాచార కేసుల్లో మరణశిక్ష విధిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన వారికి మరణిశిక్ష విధిస్తారు.

చిన్నారులను లైంగికంగా వేధింపులకు గురి చేస్తే 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అత్యాచారాన్ని నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు  వారంరోజుల్లో దర్యాప్తు పూర్తి, 14 రోజుల్లో విచారణ పూర్తి, మొత్తం 21 రోజుల్లో జడ్జిమెంట్‌ ఇచ్చేలా చట్టంలో మార్పులు చేయనున్నారు. ఇప్పుడు మాములుగా 4 నెలలు ఉన్న విచారణ సమయాన్ని 21 రోజులకు కుదించింది. దీనితో పాటు మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెట్టిన వారిపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 354 (ఇ) కింద చర్యలు తీసుకునేలా బిల్లులో అంశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే నేరాలు చేసేందుకు వెనుకంజ వేస్తారన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp