ఏపీ లో దిశా యాక్ట్

By Bairisetty Nagaraju Dec. 13, 2019, 05:14 pm IST
ఏపీ లో దిశా యాక్ట్

రాష్ట్రం లో మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం దిశా యాక్ట్ తీసుకువచ్చింది. 5వ రోజైన శుక్రవారం ఈ బిల్లును హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టారు. అనంతరం సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సభలో బిల్లు ఆమోదం పొందిన తరువాత మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యే లు హర్షం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ లోని మీడియా పాయింట్ కేక్ కట్టి చేసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం యాక్ట్ పనితీరుని వివరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ మహిళా లోకానికి సీఎం జగనన్న అండగా ఉన్నారని ఈ యాక్ట్ ద్వారా స్పష్టమైందని అన్నారు. జగన్ రాష్ట్రం లో అందరి ఆడపడుచులకు అన్నగా మారి పోయారని కొనియాడారు. మహిళల భద్రత కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చిన జగన్ ను రాష్ట్రం లోని మహిళలంతా రుణపడి ఉంటానని అన్నారు. దిశా యాక్ట్ ద్వారా అన్యాయాలకు మహిళలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp