దిశ ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి విజువల్స్

By Siva Racharla Dec. 06, 2019, 08:23 am IST
దిశ ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి విజువల్స్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఈ ఉదయం నాలుగు గంటల సమయంలో ఎన్ కౌంటర్ చేశారు .


వివరాల్లోకి వెళితే గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. నిందితులను ఉరి తీయాలంటూ ఎన్ కౌంటర్ చేయాలంటూ ప్రజలు, మహిళా సంఘాలు విద్యార్థులు ఆందోళనలు వ్యక్తం చేశారు. అయితే పోలీసు దర్యాప్తులో మహ్మద్‌ ఆరిఫ్‌, పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులు కలిసి ఈ దురాగతానికి పాల్పడినట్లుగా కనుగొన్నారు. వారిని అరెస్టు చేసి చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉంచారు.


అయితే కోర్టు నిందితులను ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. దీనితో విచారణలో భాగంగా నిందితులను సీన్ రి కన్స్ట్రక్షన్ చేయడానికి చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గరకు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పోలీసులు తీసుకువెళ్లారు. సీన్ రి కన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పోలీసుల వద్ద ఆయుధాలను లాక్కుని పారిపోతుండగా ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు మహ్మద్‌ ఆరిఫ్‌, పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులు మరణించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp