దిశ పోలీసుల దశ మార్చనుందా..?

By Kotireddy Palukuri Dec. 13, 2019, 12:25 pm IST
దిశ పోలీసుల దశ మార్చనుందా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలమైన విషయం తెలిసిందే. ఘటన పై యావత్ భరతం ఏకతాటిపైకి వచ్చి, నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసింది. సాధారణ పౌరులతో పాటు, శాసనాలు చేసే ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఘటన జరిగిన రోజు నుంచి ఆందోళనలు చేశారు. ప్రజా స్పందన అనుగుణంగా నిందితులు ఎంకౌంటర్లో చనిపోయారు. 9 రోజుల పాటు జరిగిన ఆందోళనలు తగ్గాయి. ఎంకౌంటర్ చేసిన పోలీసులు, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై ప్రశంసల జల్లు కురిసింది. పోలీసుల పై పుష్ప వర్షం కురిపించారు.

ఇదంతా గతం.. ఇప్పడు దిశ ఎంకౌంటర్ పై మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ప్రజా సంఘాలు, న్యాయవాదులు ఎంకౌంటర్ పై సుప్రీం లో పిటిషన్ లు దాఖలు చేశారు. వీటిని విచారించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ఏ . బొబ్దే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది.

సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సిరిపుర్కర్ నేతృత్వంలో బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాష్, సిబిఐ మాజీ అధిపతి డి.ఆర్. కార్తీకేయన్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ ఎంకౌంటరుపై విచారణ జరపనుంది. 6 నెలల్లో నివేదిక ఇచేలా కమిటీకి సుప్రీం కోర్టు లక్ష్యం నిర్దేసింది. హైద్రాబాద్ కేంద్రంగా 6 నెలల పాటు కమిటీ అన్ని కోణాల్లో విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో సిపి సజ్జనార్ బృందానికి కొత్త చిక్కులు వచ్చినట్లుగా పరిస్థితులు కనపడుతున్నాయి.

దిశ ఎంకౌంటర్ తర్వాత.. దేశంలో గతంలో జరిగిన అత్యాచార నిందితుల శిక్ష లపై తీవ్ర చర్చ జరిగింది. ఫలితంగా దిశ ఎంకౌంటర్ తీవ్ర చర్చనీయాంశమైంది. నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్ళు అవుతున్నా దోషులకు శిక్ష పడలేదంటూ ఏకంగా నిర్భయ తల్లి మీడియా ముందుకు వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి ప్రధాని మోదీ నేర్చుకోవాలని హితవు పలకడం సంచలనమైంది. మరో వైపు తాజాగా ఉత్త్తర ప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన అక్కడ యోగి ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మచ్చగా నిలిచింది. రేప్ చేసిన వారిపై బిజెపి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, పైగా వారిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు సాధించాయి. ఇలాంటి పరిస్థితులే దిశ నిందితుల ఎంకౌంటర్ పై త్రిసభ్య కమిటీ విచారణ విచారణకు పురిగొల్పాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp