'ఏపీ దిశ'లో ఏముంది..?

By Kotireddy Palukuri Dec. 13, 2019, 05:30 pm IST
'ఏపీ దిశ'లో ఏముంది..?

ప్రజా సంక్షేమం లో దేశంలోనే తాము ముందుంటామని మరోమారు జగన్ సర్కార్ నిరూపించింది. దేశ వ్యాప్తంగా సంచలనమైన దిశ అత్యాచార, హత్య ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన మొదటి రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో మహిళా రక్షణకు, మహిళలు, చిన్నారుల పై జరిగే నేరాలను అరికట్టేందుకు సరి కొత్త చట్టాన్ని తెచ్చింది.

పటిష్టమైన చట్టానికి ' ఏపీ దిశ' గా నామకరణం చేసింది. అందుకు సంభందించిన ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగెనెస్ట్‌ వుమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019 బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన సభ శుక్రవారం ఆమోదించింది. మండలి, ఆ తర్వాత గవర్నర్ ఆమోద ముద్ర లాంఛనమే కావడంతో ఈ బిల్లు కొద్దీ రోజుల్లో చట్ట రూపం దాల్చనుంది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు.

బిల్లులో ఏముంది..?


- 'ఏపీ దిశ’ చట్టం ప్రకారం రేప్‌ చేసినవారికి తప్పనిసరిగా మరణ శిక్ష విధింపు. .

- వారం రోజుల్లో.పోలీస్ దర్యాపు పూర్తి. 14 రోజుల్లో న్యాయ విచారణ ముగింపు. మొత్తం 21 రోజుల్లోపు దోషికి శిక్ష.

- పిల్లల పై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి జీవితాంతం జైలు, లేదా మరణ శిక్ష.

- పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా ఫోక్షో చట్టానికి సవరణ.

- సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే మొదటి సారి రెండేళ్లు, రెండో సారి తప్పుకు 4 ఏళ్లు శిక్ష.

- దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణ వేగంగా ముగించడానికి వీలుగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు.

- అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, సోషల్‌మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ప్రత్యేక కోర్టు పరిధిలోకి వస్తాయి.

- ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునేందుకు గడువు మూడు నెలలు.

- మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల ఏర్పాటు.

- దర్యాప్తు కోసం జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీం లు ఏర్పాటు.

- మహిళలు, పిల్లలపై నేరాలను నమోదుచేసేందుకు డిజిటిల్‌ రిజిస్ట్రీ నిర్వహణ. ఈ నేరాలకు చేసిన నిందితుల వివరాలు బహిర్గతం చేయనున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp