Bandi Srinivas, AP NGO - ఆఫ్ ది రికార్డ్ మాటలు కూడా కవర్ చేస్తున్నారా..?

By Voleti Divakar Dec. 08, 2021, 07:00 pm IST
Bandi Srinivas, AP NGO - ఆఫ్ ది రికార్డ్ మాటలు కూడా కవర్ చేస్తున్నారా..?

తెలుగుదేశం పార్టీకి అనుకూలమైతేనే ఆఫ్ ది రికార్డు మాటలు ప్రచురించాలి . ఇది ప్రస్తుత పచ్చమీడియా విధానం . ఇటీవల ఏపి ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఎన్జీఓల అంతర్గత సమావేశంలో మాట్లాడిన మాటలను తెలుగుదేశం అనుకూల పచ్చమీడియా పతాక శీర్షికన ప్రచురించింది . ఈ సమావేశంలో ' మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు ... నిలబెట్టొచ్చు . మా శక్తి ముందు ప్రభుత్వం తలవంచాల్సిందే ' అని అన్నట్లు పేర్కొంది . అయితే అసలు తాను ఆ సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయనేలేదని శ్రీనివాసరావు ఖండిస్తున్నారు . తాను అనని మాటలను ఒకవర్గం మీడియా ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు .

అయితే నాడు చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను పతాక శీర్షికలో వేసిన పచ్చమీడియా ఖండించిన విషయాన్ని కిమ్మనకుండా దాచేసింది . తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను ఒకవైపు రెచ్చగొట్టడం.. మరోవైపు ప్రభుత్వ పెద్దల్లో కూడా ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావన పెంచడమే ఈవార్తల ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది . ప్రభుత్వం , ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సఖ్యత లేకపోతే ఒక విధంగా తమ అభిమాన పార్టీకి కలిసి వస్తుందన్నది వారి భావనలా కనిపిస్తోంది .

ఉద్యోగ సంఘాల్లో చీలిక.. 

బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి . కొన్ని సంఘాలు ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టాయి . ఆ ప్రభావం ఉద్యోగుల సమ్మెపై కూడా కనిపిస్తోంది . సమ్మె విషయంలో ఉద్యోగ సంఘాలు చీలిపోయినట్లు స్పష్టమవుతోంది . పీఆర్సీ సాధన కోసం ఏపీ ఎన్జీఓ , ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం సమ్మెకు పిలుపునిచ్చాయి . దీనిలో భాగంగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు .

అయితే సమ్మె ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. ఏపీ ట్రెజరీ , ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దూరమని ప్రకటించడం గమనార్హం . 10 రోజుల్లోగా పీఆర్సీని ప్రకటిస్తానని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో సమ్మెకు పిలుపునివ్వడం సబబుకాదని కొన్ని సంఘాల నేతలు  అభిప్రాయపడుతున్నారు . ఇప్పటి వరకు ఆగిన వారు 10 రోజులు ఆగలేరా అంటూ ఎన్జీవో, రెవెన్యూ సంఘాలను నిలదీస్తున్నారు . అయినా సమ్మె అన్నది . చివరి అస్త్రంగా ఉండాలని నేరుగా సమ్మెకు దిగడం సబబుకాదన్నది సీనియర్ ఉద్యోగ నేతల సలహా . రెవెన్యూ ఉద్యోగుల సంఘం సమ్మెకు పిలుపునిచ్చాయి . దీనిలో భాగంగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు .

Also Read : Tdp, Yellow Media, Employees Unions - టీడీపీ, పచ్చ మీడియా కలిసి ఉద్యోగ సంఘాలను వాడుకోవాలని చూస్తున్నాయా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp