ఉసేన్ బోల్ట్ రికార్డును భారతీయుడు బద్దలు కొట్టాడా?

By Kiran.G Feb. 15, 2020, 12:10 pm IST
ఉసేన్ బోల్ట్ రికార్డును భారతీయుడు బద్దలు కొట్టాడా?

శ్రీనివాస గౌడ ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ గా,పరుగుల చిరుతగా పేరుపొందిన ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలుకొట్టాడని సోషల్ మీడియాలో శ్రీనివాస్ గౌడను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.. నిజంగానే ఉసేన్ బోల్ట్ రికార్డ్ బద్దలు కొట్టాడా అనే ఆసక్తి అందరిలో మొదలయ్యింది..

వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని మూడబిదిరి గ్రామానికి చెందిన శ్రీనివాస గౌడ అక్కడ నిర్వహించే సంప్రదాయ పరుగు పోటీల్లో తన కోడెలతో కలిసి 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకండ్లలో పూర్తి చేసాడు.. ఇందులో మరో విశేషం ఉంది.. ఈ పరుగు పోటీలు నిర్వహించేది బురదతో కూడిన ట్రాకుల్లో.. అతడి వేగాన్ని వంద మీటర్లకు కుదించి కాలిక్యులేట్ చేసి చూసి, 9.55 సెకండ్లలో 100 మీటర్లు దూరం పూర్తి చేయగలడని లెక్కలు వేసి ఉసేన్ బోల్ట్ 9.58 సెకండ్లలో 100 మీటర్ల దూరం పరిగెత్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతనికంటే తక్కువ సమయంలో శ్రీనివాస గౌడ పరిగెత్తాడని సోషల్ మీడియాలో అతన్ని పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు.


ట్విట్టర్ లో ఈ విషయం పోస్ట్ చేస్తే పలువురు ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం తన కోడెలు లాగడం వల్లే అతనంత వేగంగా పరిగెత్తాడని అంటున్నారు. ఉసేన్ బోల్ట్ ఎంతో ట్రైనింగ్ తీసుకున్న స్ప్రింటర్.. పైగా తను పరిగెత్తింది సింథటిక్ ట్రాక్ పై.. కానీ శ్రీనివాస్ మాత్రం బురదతో కూడిన ట్రాక్ లో పరిగెత్తాడని అతనికి ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా దేశానికి పతకం తీసుకువస్తాడని నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంశిస్తున్నారు.. ఏదేమైనా శ్రీనివాస గౌడ లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించి సరైన శిక్షణ ఇప్పిస్తే దేశ కీర్తిని పెంచడంతో పాటు పతకాలను సాధించడం మాత్రం ఖాయం..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp