ఆ ఎమ్మెల్యేను జైలర్ తన్నాడా?

By Siva Racharla Dec. 12, 2019, 08:28 pm IST
ఆ ఎమ్మెల్యేను జైలర్ తన్నాడా?

నీవు ఎలక్షన్ల వరకు బతికుంటే..ఆ తరువాత బతుకుతావు. అప్పటి దాకా ఎలాగైనా నీవు బతుకు" అని జగన్ చెవిరెడ్డికి ఎందుకు చెప్పాడు?

2014 శాసనసభలో రోజా,కొడలి నాని,అనిల్ యాదవ్ ,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్ బ్రాండ్స్... అధికార పక్షంతో మాటకు మాటతో యుద్దానికి దిగేవారు. రోజా మీద సంవత్సరం పాటు నిషేధం విధించగా కొడాలి నాని ఆఫీసును అర్ధరాత్రి పోలీసులు ఖాళి చేయించారు,ఆ సందర్భంగా జరిగిన వాదనలో కొడాలి నాని మీద కేసు కూడా పెట్టారు.చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీకి గెలుపును అందని ద్రాక్షను చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే చంద్రబాబుకు కోపం,కక్ష ఉన్నట్లు కనిపిస్తుంది.ఈ రోజు శాసనసభలో జరిగిన చర్చలో గత ప్రభుత్వ హయాంలో తన మీద జరిగిన దాడుల గురించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించాడు.

రెవిన్యూ అధికారులు ఒక వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్త ఇల్లు కూల్చివేయగా చెవిరెడ్డి ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసనకు దిగాడు. ఆ నిరసన కార్యక్రమంలో చెవిరెడ్డి సబ్‌కలెక్టర్‌ డఫేదార్‌ను కులంపేరు పెట్టి దూషించాడన్న ఆరోపణతో చెవిరెడ్డి మీద సబ్‌ కలెక్టర్‌ కేసు పెట్టాడు.ఆ అక్రమ కేసులో చెవిరెడ్డిని కడప సెంట్రల్‌ జైల్‌లో పెట్టారు.

కడప జైల్లో ఉదయం 6 గంటలకు బయట కూర్చొని ఉన్న చెవిరెడ్డిని ఇక్కడెందుకు కూర్చున్నావురా అని ఒక జైలర్‌ ఎగిరి తన్నాడంట.ఆ అవమానాన్ని తట్టుకోలేక రెండు రోజులు నీళ్లు కూడా ముట్టుకోకుండా చెవిరెడ్డి నిరాహార దీక్ష చేశాడంట.స్థానిక చిత్తూర్ జైలుకు కాకుండా కడప జైలుకు ఎందుకు పంపారు?తన్నించటానికే కడప జైలుకు పంపారా అన్న ప్రశాంత్ చెవిరెడ్డి మాటల్లో వ్యక్తమయింది.

మరో సంఘటనలో,ఎన్నికలకు ముందు ట్యాబ్‌లు పెట్టి ఓట్లు తొలగిస్తుంటే అడ్డుకున్నందుకు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను చిత్తూరుకు జైలుకు తీసుకెళ్లి కొట్టారంట. కార్యకర్తలను విడుదల చెయ్యమని ధర్నాకు దిగిన చెవిరెడ్డిని రాత్రి 10.30 గంటలకు పోలీసు బస్సులో ఎక్కించుకొని తమిళనాడుకు తీసుకెళ్లారు. చెవిరెడ్డిని రాత్రంతా బస్సులో తిప్పిన పోలీసులు మైగ్రేన్ తలనొప్పితో బాధపడ్డా ట్యాబ్లెట్‌ ఇప్పించలేదంట .తల నొప్పి తట్టుకోలేక బస్సుకు తల కొట్టుకున్నా పోలీసులు కనికరించి టాబ్లెట్ ఇప్పించలేదంట.ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు వీడియో తీశారు,ఆ వీడియో ఇప్పటికి చిత్తూరు పోలీసుల వద్ద ఉందని చెవిరెడ్డి చెప్పాడు.

కొన్ని సంఘటనలను బాధితుడి కోణంలో వినటం తప్ప సాక్షాలు లేని అంశాలలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేవు. చెవిరెడ్డి చెప్పినట్లు ఆ వీడియో కనుక ఉంటే ఆ దాష్టీకాల బాధ్యులు ,వారిని ప్రోత్సహించిన రాజకీయ పెద్దల బండారం బయటపడుతుంది. 

చెవిరెడ్డి మీద ప్రభుత్వ వేధింపుల మీద స్పందిస్తూ "నీవు ఎలక్షన్ల వరకు బతికుంటే..ఆ తరువాత బతుకుతావు. అప్పటి దాకా ఎలాగైనా నీవు బతుకు" అని చెప్పాడంట.

ఇంకో సందర్భంలో, నల్ల బ్యాడ్జి పెట్టుకొని శాసనసభకు వస్తుంటే సభ బయటే చెవిరెడ్డిని అరెస్టు చేసి మంగళగిరి పోలీసు స్టేషన్‌లో పెట్టారు. రెండు రోజులు పోలీసు స్టేషన్‌లో పెట్టారు. దీనికి నిరసనగా జగన్ శానసభ నుంచి వాకౌట్‌ చేశాడు. చెవిరెడ్డి అరెస్ట్,జగన్ వాకౌట్ అప్పట్లో మీడియాల్లో ప్రసారమయ్యాయి.

ప్రభుత్వాలు ప్రతిపక్ష సభ్యులను,నాయకులను వారి స్థాయిని బట్టి అణిచివేసే ప్రయత్నం చేస్తాయి కానీ చెవిరెడ్డిని కట్టడి చెయ్యటానికి మీద ఏకంగా ఒక DSP నే కేటాయించారు. ఆ అధికారి దాడికి తట్టుకోలేక చెవిరెడ్డి 2017-2018 మధ్య కొన్ని నెలలు రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయాడు.

చెవిరెడ్డి ఈ రోజు చెప్పిన సంఘటనలలో కొన్ని అందరు చూసినవి ,జైలర్ తన్నటం లాంటిది సాక్షం లేనిది. కానీ చెవిరెడ్డి మాటల్లోని ఆర్ద్రత ఆలోచింపచేస్తుంది.

రాజధాని భూముల విషయంలో నోట్లో తుపాకీ పెట్టి బెదిరించిన పోలీసులను ఎదిరించిన నందిగం సురేష్ లాంటి సామాన్యుడిని లోక్ సభకు పంపిన జగన్ ఈ ఐదు సంవత్సరాలలో తనపై అణిచివేత ఆరోపణలు రాకుండా పాలించాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp