ABN Fake Audio Peddareddy-ఏబీఎన్ ఆ స్థాయికి పడిపోయిందా, ఎందుకిలా దిగజారుతోంది

By Raju VS Oct. 18, 2021, 07:30 pm IST
ABN Fake Audio Peddareddy-ఏబీఎన్ ఆ స్థాయికి పడిపోయిందా, ఎందుకిలా దిగజారుతోంది

సహజంగా కొన్ని థర్డ్ గ్రేడ్ వెబ్ చానెళ్లు, కొన్ని పార్టీల ఐటీ వింగుల పరిస్థితి చూస్తే అసహ్యం వేస్తుంటుంది. ఎవరైనా ఓ నాయకుడిని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు అక్కడి మాట ఒకటి, ఇక్కడి మాట ఒకటి అతికించి ప్రసారం చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తారు. తద్వారా ప్రజలను పక్కదారి పట్టించవచ్చని భ్రమిస్తుంటారు. ఇప్పుడు అదే క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా చేరింది. తొలుత బూతు బొమ్మలు ప్రసారం చేసి పాపులారిటీ సాధించిన ఈ చానెల్ ఇప్పుడు కట్, పేస్ట్ వీడియోలతో జనాలను వంచించేందుకు సిద్ధమవుతోంది.

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారం దానికి లేటెస్ట్ ఉదాహరణ. ఆసరా పథకానికి సంబంధించి మహిళలకు న్యాయం చేసేందుకు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేసేందుకు ఆ నియోజకవర్గం వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పలు సభలకు హాజరవుతున్నారు. ఆ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలి మీద విమర్శలు చేస్తున్నారు. తాడిపత్రి మునిసిపాలిటీ ఎన్నికల్లో చేసిన అక్రమాల నుంచి పట్టణ ఓటర్లను మభ్యపెట్టిన క్రమం వరకూ ప్రస్తావిస్తున్నారు. ఆ భాగాన్ని వదిలేసి మధ్యలో సీఎం జగన్ గురించి ప్రస్తావించిన భాగాన్ని పట్టుకుని మధ్యలో పేస్ట్ చేయడం ద్వారా ఏబీఎన్ దుష్ప్రచారానికి పూనుకుంది. మొత్తం వీడియో చూస్తే మధ్యలో ఈ విషయం అందరికీ ఇట్టే అర్థమవుతుంది.

Also Read : ABN RK Kothapaluku - కొత్త విషయం ఏముంది..?

కానీ కొన్ని సెకన్ల బిట్ కట్ చేసి జగన్ పై కేతిరెడ్డి ఘాటు విమర్శలంటూ మసాలా అద్దే ప్రయత్నం చేసింది. ఏబీఎన్ బాటలో మరిన్ని పచ్చ చానెళ్లు పయనించడం విశేషం. వాస్తవంగా అది నిన్నటి సభలో జరిగిన వ్యవహారం. తాడిపత్రి వాసులందరికీ తెలిసిన విషయం. కానీ ఏబీఎన్ మాత్రం ఈరోజు దానికి కలర్స్ అద్ది రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నానికి దిగజారడం విస్మయకరంగా మారింది. దీనిపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. గతంలోనే ఏబీఎన్ పేరు చెప్పగానే జేసీ బ్రదర్స్ ఛీ అని కెమెరా సాక్షిగానే ఉమ్మేసిన అనుభవం ఉంది. అయినప్పటికీ జేసీ బ్రదర్స్ కోసం కేతిరెడ్డి మీద అబద్ధాల ప్రచారానికి పూనుకోవడం వారి నైజాన్ని చాటుతోంది.

ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సీరియస్ గా స్పందించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వైఎస్ కుటుంబంంతో తన అనుబంధాన్ని ఇలాంటి వక్రీకరణలతో చెదరగొట్టలేరని స్పష్టం చేశారు. అడ్డగోలు ప్రసారాలకు పూనుకున్న వారి వ్యవహారం చూస్తామని తేల్చిచెప్పారు. అయినా ఎమ్మెల్యే అభిప్రాయంతో ప్రసారం చేయాల్సిన జర్నలిజం విలువలు ఎప్పుడో మరిచిన ఏబీఎన్ ఇలా సగం సగం విషయాలతో చేస్తున్న విన్యాసాలు విస్మయకరంగా మారుతున్నాయి. అసలు ఈ థర్డ్ గ్రేడ్ జర్నలిజంతో ఏబీఎన్ పరువు ఎక్కడికి పతనమవుతుందో తెలుసుకుంటే మంచిదనే సూచనలు వినిపిస్తున్నాయి. వారం వారం వీక్షకులకు థర్మోపదేశాలు చేసే రాధాకృష్ణ ముందు సొంత ఇంటి కంపు శుభ్రం చేసుకోవాల్సిన ఆవశ్యాన్ని ఇలాంటివి చాటి చెబుతూ ఉంటాయి.

Also Read : ABN Andhra Jyothi : బాబు - రాధాకృష్ణల కాంట్రాక్టు 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp