"రాజధానా ? రియల్ ఎస్టేట్ వ్యాపారమా ?" - ధర్మాన

By Sridhar Reddy Challa Dec. 17, 2019, 04:39 pm IST
"రాజధానా ? రియల్ ఎస్టేట్ వ్యాపారమా ?" - ధర్మాన

రాజధాని నిర్మాణంపై చర్చ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీలో మంగళవారం సుదీర్ఘంగా ప్రసంగించారు. తన ప్రసంగంలో రాజధాని పేరుతో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన, అస్తవ్యస్థ విధానాలతో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. రాజధానిపై తీసుకొనే నిర్ణయాలు రాజ్యంగ పరిధిలో వుండాలని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని హితవు పలికారు

చంద్రబాబు ప్రజల నుండి ప్రతిపక్ష రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదని, అన్ని అసత్య ప్రచారాలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసాడని ఆరోపించారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే దోపిడికి రంగం సిద్ధం చేసుకున్నారని ధర్మాన దుయ్యబట్టారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర లలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకి 10 ఎకరాలకు మించి లేదని, 70 ఏళ్ల నుండి అభివృద్ధి మొత్తం హైదరాబాద్ లోనే కేంద్రికృతం అవ్వడం వల్ల అన్ని వర్గాల వ్యక్తులు హైదరాబాద్ లోనే పెట్టుబడి పెట్టారని దానితో తర్వత వచ్చిన ప్రత్యేక ఉద్యమంతో ఆ అభివృద్ధి ఫలాలు మొత్తం కేవలం ఆ ప్రాంతానికే చెందాయని,హైదరాబాద్ వదలి రావడం ఎవరికీ ఇష్టం లేకపోయినా సీమాంధ్రులందరు హైదరాబాద్ నుండి కట్టుబట్టలతో బయటకి రావాల్సి వచ్చిందని, ఉమ్మడి రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉంటే అప్పుడు విభజన జరిగినా మనకి ఇంత ఆవేదన ఉండేది కాదని అన్నారు

ఇంత జరిగినా ఇప్పుడు కూడా ప్రపంచస్థాయి రాజధాని పేరుతొ చంద్రబాబు చేసిన తప్పే మళ్ళీ చేశారని, అంతర్జాతీయ రాజధాని అని ప్రచార సాధనాల ద్వారా ప్రజలను నమ్మించి తానూ తన కుటుంబం తన వర్గం భారీ దోపిడీకి తేరా తీశారని, అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ది చెప్పారన్నారు.ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా యువకుడైన జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నారని ముఖ్యమంత్రిని అభినందించారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో తమలాంటి వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకి, ఉత్తరాంధ్రకి, రాయలసీమ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి 25 కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేటాయిస్తే కనీసం ఒక్కటంటే ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థని కూడా తమ వెనుకబడిన శ్రీకాకుళానికి కేటాయించకపోవడం అన్యాయం అని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తోర్పడిన శ్రీకాకుళంకు  ఇంత అన్యాయం చేయడం శ్రీకాకుళం ప్రజలని కలచివేసిందని అందుకే ఎన్నికల్లో చంద్రబాబు విధానాలని ఉత్తరాంధ్ర ప్రజలు రాయసీమ ప్రజలు చిత్తూ చిత్తుగా ఓడించారని అన్నారు.

ప్రజా రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చంద్రబాబు లబ్ది పొందాలని చూసారని, దానికోసమే ప్రణాళికలు రూపొందించారని మాకు మొదటినుండి అనుమానంగానే ఉందని, రాజధానిలో జరిగిన నామమాత్రపు చూశాక ఆ అనుమానం బలపడిందని అన్నారు. అక్కడ జరిగిన అభివృద్ధికి, చంద్రబాబు చెప్పే మాటలకి పొంతన లేదని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే బాబు ప్రణాళికలు వేశారన్నారు. బాబు చెప్తున్నట్టు రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే లక్ష కోట్లు కావాలని చెప్పిన ఆయన తన హాయంలో కేవలం 5 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని, ఇలా అయితే రాజధాని నిర్మాణం పూర్తి కావటానికి 15 ప్రభుత్వాలు మారాలని దానికై ఇంకో 50 ఏళ్ళు పడుతుందని అప్పటిదాకా నిధులన్నీ రాజధానికి ఖర్చుచేసి వెనుకబడిన ఉత్తరాంధ్రలో, రాయలసీమ తో పాటు మిగతా జిల్లాల్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని, పాఠశాలల నిర్మాణలని ఆపుదామా అని చంద్రబాబుకి చురకలంటించారు. అసలు ఈ రాజధాని లోక కళ్యాణం కోసమా?? లేక లోకేష్ కళ్యాణం కోసమా?? అని మాజీ మంత్రి ధర్మాన ఎద్దేవా చేశారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp