దేవినేని అంటే వారిద్దరికీ ఎందుకు మంట!

By Mavuri S Jan. 19, 2021, 07:52 pm IST
దేవినేని అంటే వారిద్దరికీ ఎందుకు మంట!

నిప్పు లేనిదే పొగ రాదు అనేది పెద్ద నానుడి... అలాగే రాజకీయాల్లో చర్యకు ప్రతిచర్య ఉంటుందనేది సీనియర్లు చెప్పే మాట. ఇదంతా ఎందుకంటే మంత్రి కొడాలి నాని ప్రతిసారి టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీద ఎందుకు అంత కోపంతో ఊగి పోతారు? దేవినేని ఉమా పేరు చెబితేనే ఆగ్రహంతో మాట్లాడతారు ఎందుకు? అసలు దేవినేని ఉమా కొడాలి నాని కు ఉన్న గొడవలు ఏంటి? ఇప్పుడు తాజాగా మధ్యలో కి వల్లభనేని వంశీ వచ్చి దేవినేని ఉమా ను ఇష్టానుసారం మాట్లాడటం వెనుక అసలు కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే కచ్చితంగా... దశాబ్దం పాటు వెనక్కి వెళ్లి కృష్ణా జిల్లా టిడిపి రాజకీయాలను ఒకసారి పరిశీలించాల్సిందే..!

సర్వ జ్ఞాని ఉమా!

కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెత్తనం చెలాయించాలని చూసే వ్యక్తి దేవినేని ఉమా. దేవినేని రమణ హత్య తర్వాత ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా ఉమా టిడిపిలో తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించారు. ఎప్పటి నుంచో టిడిపిని నమ్ముకున్న వారిని పక్కకు తప్పించి ఆయన వేగంగా అడుగులు వేయడంలో చాలా కుట్రలు కనిపిస్తాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు చాడీలు చెప్పేవారు అన్నా, ఒకరిపై ఫిర్యాదులు చేసి ఒకరిమీద అక్కసు వెళ్లగక్కే వారన్నా భలే ఇష్టం. ఇదే అదునుగా దేవినేని ఉమా తీసుకున్నారు. తనకు నచ్చని వారిపై టీడీపీ అధినేతకు ఇష్టానుసారం చాడీలు చెబుతూ... రకరకాల ఫిర్యాదులు చేస్తూ, అజ్ఞాత లెటర్లు, ఆకాశరామన్న లేక లో పెట్టి ఇస్తూ చంద్రబాబుకు లేనిపోనివి చెబుతూ దేవినేని ఉమా చాలా దగ్గరయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు తనయుడు లోకేష్ కు అన్ని రకాలుగా సాయం అందించి ఉమా ఆయనను సైతం ప్రసన్నం చేసుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఆశించే అన్ని విషయాలను దేవినేని ఉమ చక్కబెట్టే వారు.

అందరిపైన చెప్పడమే!

దేవినేని ఉమా రాజకీయాలు చాలా వింతగా ఉంటాయి. ఆయన నివసిస్తున్న గొల్లపూడి గ్రామం లో సైతం ఆయనకు పూర్తిస్థాయి మెజారిటీ ఎప్పుడూ రాదు. ఎవరిని కలుపుకు వెళ్ళరు. నమ్మరు. కార్యకర్తలు అసలే రారు. అయితే తనకు నచ్చని వారిని, తనను నమ్ముకున్న వారిని ఒక్కోసారి తొక్కేసే స్వభావం దేవినేని ఉమాది. ఈ స్వభావం తోనే కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం మొత్తం తానే తెలపాలని అంత వినాలనే కోణంలో రాజకీయాలు చేయడం దేవినేని ఉమా మొదలుపెట్టారు. ఆ రాజకీయాల్లో బలైపోయిన వారే వల్లభనేని వంశీ, కొడాలి నాని.

ఎం చెప్పిన వినరు!

వల్లభనేని వంశీ కి గానీ కొడాలి నాని గానీ ప్రజాదరణ ఎక్కువ. ఆయా నియోజకవర్గాల్లో వారు చెప్పిందే వేదం. ఇదే పద్ధతి దేవినేని ఉమా కు నచ్చలేదు. దీంతో ఇద్దరి మీదా చంద్రబాబుకు లోకేష్కు చాడీలు చెప్పడం ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. లేనిపోని ఆకాశరామన్న ఉత్తరాలు రాణించడం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కోణంలో పలు విషయాలను వారికి చేరవేయడంతో కొడాలి నాని వల్లభనేని వంశీ ల రాజకీయ భవితవ్యం సైతం ఒకానొక సమయంలో సందిగ్ధంలో పడింది. ఇద్దరూ ప్రాణమిత్రులు అయినా పార్టీని వీడి రావడానికి ఇష్టపడలేదు. దేవినేని ఉమా మీద ఆయన తీరు మీద పలుసార్లు చంద్రబాబుకు లోకేష్ కు మొరపెట్టుకున్న వారు వినే పరిస్థితి లేదు. దీంతో టిడిపి లో ఉన్నా సరే ఒంటరిగానే వీరిద్దరూ మిగిలిపోయారు.

బయటకు వచ్చేసిన తర్వాత!

చంద్రబాబు ఒంటెద్దు పోకడలు లోకేష్ బాబు అవినీతి కార్యకలాపాలు తో పాటు దేవినేని ఉమ ఆధిపత్యం పెరగడంతో పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. ఆ సమయంలోనే వంశీ సైతం బయటకు వస్తారని అంతా భావించినప్పటికీ ఆయన అలాగే టిడిపిలో కొనసాగారు. అయితే నాని వెళ్లిపోయిన దగ్గర్నుంచి వంశీ కి మరింత బాధలు ఎక్కువ అయ్యాయి. దేవినేని ఉమా ఆధిపత్యంతో కృష్ణా జిల్లా రాజకీయాలు అన్ని తలకిందులు అయ్యే పరిస్థితులు వచ్చాయి. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు వంశీ అధినేతకు చెప్పినా ఆయన వినే పరిస్థితి లేకపోవడంతో ఆయన సైతం ఇటీవల గన్నవరం నుంచి టిడిపి నుంచి గెలిచిన పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేశారు.

ఎవరు మద్దతు లేని నేత!

ఒక మాజీ మంత్రి ని ప్రస్తుత మంత్రి ఇష్టానుసారం తిడుతున్న కృష్ణా జిల్లా టిడిపి నేతలు ఎవరూ పట్టించుకోక పోవడం వెనుక దేవినేని ఉమా రాజకీయాలే ప్రధాన కారణం. ఆయనకు ఎవరితోనూ పొసగదు. కనీసం జిల్లా నాయకులను అనుచరులను ప్రోత్సహించే పద్ధతి ఉండదు. విజయవాడ ఎంపీ కేశినేని నాని దేవినేనికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. ఇట్లు కృష్ణా జిల్లా నాయకుల్లో ఇప్పుడిప్పుడే కాస్త నోరు వేసుకుంటున్న బుద్ధా వెంకన్న సైతం దేవినేని వైఖరి పడదు. అలాగే బచ్చుల అర్జునుడు కు దేవినేని దెబ్బ వేయాలని చూశారు. దీంతో వీరంతా దేవినేని తీరు మీద చాలా గుర్రుగా ఉన్నారు. పలుమార్లు కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన మీద ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేకపోగా ఎదురు కేశినేని నాని మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన సైతం పార్టీ కార్యక్రమాలు కొన్ని రోజులు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కృష్ణా జిల్లా నేతలు కనీసం దేవినేని పలకరించుకోవడం ఆయనకు నైతిక మద్దతు ఇవ్వడం వెనుక దేవినేని రాజకీయాలే కనిపిస్తాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp