టిడిపికి షాక్ - దేవినేని అవినాష్ రాజీనామా

By Kiran.G 14-11-2019 02:05 PM
టిడిపికి షాక్ - దేవినేని అవినాష్ రాజీనామా

ఊహాగానాలు నిజమయ్యాయి. మాజీ మంత్రి దేవినేని నెహ్రు కుమారుడు, తెలుగు యువత అధ్యక్షుడు, టీడీపీ నేత దేవినేని అవినాష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ రాసిన లేఖను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపారు. నిన్న బుధవారం తన అనుచరులతో సమావేశమైన అవినాష్ వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీ మార్పు పై నిర్ణయం తీసుకున్నారు.

Also Read: దేవినేని అవినాష్ వైసిపి తీర్థం పుచ్చుకుంటున్నాడా?

కాగా, ఇసుక కొరత అంశం పై విజయవాడలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దీక్ష చేస్తున్న సమయంలోనే నగరానికి చెందిన అవినాష్ రాజీనామా చేయడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టిడిపికి జవసత్తువలు నింపేందుకు సుమారు 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు 12 గంటల దీక్ష చేస్తుండగా మరో వైపు పార్టీ నేతలు తమ భవిష్యత్ కోసం దారులు వెతుక్కుంటున్నారు. చంద్రబాబు దీక్ష సమయంలోనే దేవినేని రాజీనామా టిడిపికి పెద్ద షాక్ గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News